గాల్లోనే ఫోన్‌ ఛార్జింగ్..సాధ్యమేనా? 
close

Published : 29/01/2021 19:08 IST

గాల్లోనే ఫోన్‌ ఛార్జింగ్..సాధ్యమేనా? 

ఇంటర్నెట్ డెస్క్‌: గతంలో మొబైల్ ఛార్జ్‌ చేయాలంటే తక్కువలో తక్కువ రెండు గంటలు పట్టేది. అదే ఇప్పుడైతే 20 నిమిషాల్లో 80 శాతం బ్యాటరీ ఛార్జ్‌ అవుతోంది. ఇప్పటికే మొబైల్ కంపెనీలు ఫాస్ట్‌ ఛార్జింగ్, వైర్‌లెస్‌ ఛార్జింగ్‌ టెక్నాలజీతో ఛార్జర్లను అందిస్తున్నాయి. తాజాగా షావోమి కంపెనీ ప్రస్తుతం ఉన్న ఛార్జర్‌లకు భిన్నంగా ఎయిర్‌ ఛార్జింగ్ టెక్నాలజీతో రిమోట్ ఛార్జర్‌ను తీసుకొస్తున్నట్లు ప్రకటించింది. ఇందులోని ఎయిర్‌ ఛార్జింగ్‌ టెక్నాలజీ సహాయంతో ఫోన్ ఛార్జర్‌కు కనెక్ట్‌ చేయకుండా దూరం నుంచి ఛార్జ్‌ చేసుకోవచ్చు. దీనికి ఎలాంటి కేబుల్స్, ఛార్జింగ్ స్టాండ్ అవసరం లేదు. ఎంఐ ఎయిర్‌ ఛార్జర్ పేరుతో తీసుకొస్తున్న ఈ ఛార్జర్‌ నాలుగు సెంటీమీటర్ల పరిధి వరకు వైర్‌లెస్‌గా పవర్‌ని సరఫరా చేస్తుంది. దీని సహాయంతో ఒకేసారి ఒకటి కన్నా ఎక్కువ డివైజ్‌లను ఛార్జ్‌ చేసుకోవచ్చు. 

ప్రస్తుతం పరీక్షల దశలో ఉన్న ఈ ఛార్జింగ్ టెక్నాలజీని భవిష్యత్తులో వినియోగదారులకు అందుబాటులోకి తీసుకురానున్నారు. ఈ ఎయిర్‌ ఛార్జర్‌లో దిమ్మె లాంటి వస్తువు ఉంటుంది. అందులో ఐదు యాంటీనాలు ఉంటాయి. అవి పవర్‌ని తరంగాల ద్వారా స్మార్ట్‌ఫోన్‌కు అందజేస్తాయి. ఇల్లు, ఆఫీస్, షాపింగ్ మాల్‌..ఇలా ఎక్కడైనా దీన్ని ఏర్పాటు చేసుకోవచ్చు. అయితే ఈ ఛార్జింగ్ టెక్నాలజీతో ఆరోగ్యపరమైన సమస్యలు తలెత్తే ప్రమాదం లేకపోలేదని పలువురు నిపుణులు సందేహాలు వ్యక్తం చేశారు. షావోమి సంస్థ మాత్రం ఇది కేవలం భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకొని రూపొందించిందని..అన్ని రకాల అనుమతులు తీసుకున్న తర్వాతే మార్కెట్లో ప్రవేశపెడతామని తెలిపింది. 

ఇవీ చదవండి..

ఫోన్‌ ఛార్జింగ్‌..మీరూ ఈ తప్పులు చేస్తున్నారా..?

జిబ్‌ ట్రూ: సింగిల్‌ ఛార్జ్‌తో రోజంతా మ్యూజిక్‌Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

తాజా వార్తలు

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

దేవ‌తార్చ‌న