Smartwatch: షావోమి కొత్త వాచ్‌..దీన్ని మడతబెట్టొచ్చు..! 
close

Published : 30/07/2021 23:06 IST
Smartwatch: షావోమి కొత్త వాచ్‌..దీన్ని మడతబెట్టొచ్చు..! 

(Photo Credit: Xiacom)

ఇంటర్నెట్‌డెస్క్: ఆకర్షణీయమైన డిజైన్లతో తక్కవ ధరలో ఎక్కువ ఫీచర్లతో గ్యాడ్జెట్స్‌ అనగానే గుర్తొచ్చేది షావోమి కంపెనీయే. తాజాగా షావోమి 360 - కోణంలో తిరిగేలా ఫ్లెక్సిబుల్ డిస్‌ప్లేతో కొత్త స్మార్ట్‌వాచ్‌ను తీసుకొస్తున్నట్లు సమాచారం. దీన్ని యూజర్‌ తనకు నచ్చినట్లుగా మార్చుకునేందుకు వీలుగా తయారుచేస్తున్నారట. అలాగే, ఈ స్మార్ట్‌వాచ్‌కి బకెల్‌, స్ట్రాప్స్‌ వంటివి ఉండవు. అయస్కాంత శక్తి ఆధారంగా ఈ వాచ్‌ చేతిపై ఉండిపోతుంది. ఈ వాచ్‌ 4-అంగుళాల ఓఎల్‌ఈడీ ఫ్లెక్సీబుల్ డిస్‌ప్లేతో రానుంది. దీన్ని పైనుంచి కిందకు స్క్రోల్ చేసుకోవచ్చు. పైఫొటో ప్రకారం ఈ వాచ్‌లో కెమెరా కూడా ఉంటుందని స్పష్టంగా తెలుస్తోంది. ప్రస్తుతం ప్రయోగాల దశలో ఉన్న ఈ స్మార్ట్‌వాచ్‌ను త్వరలోనే వినియోగదారులకు అందుబాటులోకి తీసుకొస్తారని టెక్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

ఇప్పటికే ఈ వాచ్‌ తరహాలోనే నుబియా కంపెనీ అల్ఫా పేరుతో ఫ్లెక్సీబుల్ డిస్‌ప్లేతో వాచ్‌ను తీసుకొచ్చింది. ఇందులో 4-అంగుళాల ఓఎల్‌ఈడీ డిస్‌ప్లే ఇచ్చారు. ఈ వాచ్‌లో కెమెరా, ఈ-సిమ్‌ సపోర్ట్‌ ఉన్నాయి. అలానే షావోమి కంపెనీ ఈ ఏడాది మొదట్లో ఎంఐ స్మార్ట్‌ బ్యాండ్ 6ని తీసుకొచ్చింది. ఇందులో 1.566-అంగుళాల అమోలెడ్ డిస్‌ప్లే ఇచ్చారు. 125ఎంఏహెచ్ బ్యాటరీతో పనిచేస్తుంది. దీన్ని ఒక్కసారి ఛార్జ్ చేస్తే 14 రోజులు నిరంతరాయంగా పనిచేస్తుంది. ఇందులో 30 స్పోర్ట్స్‌ మోడల్స్‌ ఉన్నాయి. హార్ట్‌రేట్ మానిటరింగ్, ఎస్‌పీఓ2 వంటి ఫీచర్స్ ఉన్నాయి.

ఇవీ చదవండి


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

తాజా వార్తలు

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

దేవ‌తార్చ‌న