close

Updated : 26/02/2021 10:27 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
యూట్యూబ్‌లో పిల్లలపై నిఘా..

మూడు రకాలుగా కంటెంట్‌ సెట్టింగ్స్‌..

రోజులో ఎక్కడ ఛాన్స్‌ దొరికినా.. టైమ్‌పాస్‌కి వాలిపోయేది యూట్యూబ్‌లోనే. అంతలా లెక్కకు మిక్కిలి వీడియోలు అందుబాటులో ఉన్నాయి. పెద్దలైతే కావాల్సిన వాటిని వెతికి చూస్తారు.. మరి, పిల్లల సంగతి ఏంటి? ఏముందీ... ‘యూబ్యూబ్‌ కిడ్స్‌’ ఉందిగా అంటారా? అది బుజ్జాయిల కోసమే.. మరైతే, స్కూల్‌ వయసుకు వచ్చిన టీన్స్‌ సంగతేంటి? పేరెంట్స్‌ ఫోన్‌ తీసుకుని సరాసరి యూట్యూబ్‌లోనే విహరిస్తుంటారు. కరోనా తర్వాత ఇంటికే పరిమితం అవ్వడంతో ఇంకా ఎక్కువగా టీన్స్‌ యూట్యూబ్‌ని ఎక్స్‌ప్లోర్‌ చేస్తున్నారు. ఈ క్రమంలో తెలిసీ.. తెలియని వయసులోని ఏం చూస్తున్నారు? ఎలాంటివి చూడాలి? ఏవి వారి కంటపడకూదు?.. లాంటి విషయాలపై కచ్చితంగా పేరెంట్స్‌ ఆలోచించాలి. అందుకు తగిన నిఘా పెట్టాలి. అందుకే యూట్యూబ్‌ త్వరలోనే తల్లిదండ్రులకు ‘సూపర్‌వైజ్‌’ ఫీచర్‌ని ప్రవేశపెట్టనుంది. దీంతో పెద్దలు వాడుతున్న గూగుల్‌ ఎకౌంట్‌లోనే పిల్లలు యాక్సెస్‌ చేయాల్సిన కంటెంట్‌ని మానిటర్‌ చేయొచ్చు. మూడు రకాలుగా కంటెంట్‌ సెట్టింగ్స్‌ని పెట్టుకునే వెసులుబాటు కల్పించనుంది. అదెలాగంటే..

ఒకటి.. ‘ఎక్స్‌ప్లోర్‌’

ఇదో ప్రాథమిక విభాగం. అప్పుడప్పుడే బుజ్జాయిలు కాస్త పెద్దగా అయ్యి.. ఐదో తరగతి వచ్చిన పిల్లల కోసం అన్నమాట. అంటే.. ఫ్రెష్‌గా యూట్యూబ్‌ కిడ్స్‌ నుంచి యూట్యూబ్‌లోకి ఎంట్రీ పాస్‌ తీసుకునే వయసు పిల్లలు అన్నమాట. 9 ఏళ్లు పైబడిన పిల్లలకు తగిన సెట్టింగ్స్‌ని ‘ఎక్స్‌ప్లోర్‌’లో పొందొచ్చు. వ్లాగ్స్, ట్యుటోరియల్స్, గేమ్స్‌ వీడియోలు, మ్యూజిక్‌ క్లిప్స్, ఇతర ఎడ్యుకేషనల్‌ కంటెండ్‌ మాత్రమే కనిపించేలా చేయొచ్చు. 

రెండోది.. ‘ఎక్స్‌ప్లోర్‌ మోర్‌’

హైసూల్క్‌ వయసు పిల్లలకు సరిపడే విభాగం ఇది. 13 ఏళ్లు పైబడిన పిల్లలకు తగిన కంటెంట్‌ని దీంట్లో కనిపించేలా చేయొచ్చు. లైవ్‌ స్ట్రీమింగ్స్‌ లాంటివి కూడా పిల్లలు వీక్షించే వెసులుబాటు కల్పించొచ్చు. పలు రంగాలకు సంబంధించిన ఇతర వీడియోలను కిడ్స్‌ బ్రౌజ్‌ చేసి చూడొచ్చు.

మూడోది.. ‘మోస్ట్‌ ఆఫ్‌ యూట్యూబ్‌’

పేరులో ఉన్నట్టుగానే యూట్యూబ్‌లో ఉన్న మొత్తం కంటెంట్‌ని యాక్సెస్‌ చేసి చూడొచ్చు. అయితే.. పిల్లల వయసు ఆధారంగా ఎలాంటి కంటెంట్‌ని చూడాలనేది నియంత్రించొచ్చు. సున్నితమైన విషయాల్ని వారి కంటపడకుండా జాగ్రత్తపడొచ్చు.

‘కంటెంట్‌కి సంబంధించిన సెట్టింగ్స్‌ని మార్చడమే కాకుండా.. ఎలాంటి కంటెంట్‌ని ఎక్కువ చూస్తున్నారో తెలుసుకోవచ్చు. సెర్చ్‌ హిస్టరీని కూడా యాక్సెస్‌ చేస్తూ.. ఎలాంటివి చూసేందుకు ప్రయత్నిస్తున్నారో కనిపెట్టొచ్చు. అంటే.. పిల్లల ఎకౌంట్‌ సెట్టింగ్స్‌ని పేరెంట్స్‌ కంట్రోల్‌లోకి తెచ్చుకోవచ్చు అన్నమాట! అంతేకాదు.. పిల్లలు యూట్యూబ్‌లో ఎలాంటి కొనుగోళ్లు చేయకుండా జాగ్రత్త పడొచ్చు. 

ఇవీ చదవండి


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

తాజా వార్తలు

వెబ్ ప్రత్యేకం

దేవ‌తార్చ‌న

రుచులు