YouTube: షేరింగ్‌ స్టైల్‌ మారుతోంది...
close

Updated : 01/07/2021 12:58 IST
YouTube: షేరింగ్‌ స్టైల్‌ మారుతోంది...

ఇంటర్నెట్‌డెస్క్‌: యూట్యూబ్‌లో ఎన్నో రకాల వీడియోలు చూస్తుంటాం. వాటిలో నచ్చిన వీడియోల లింక్‌ను ఇతరులతో షేర్ చేసుకుంటుంటాం. అయితే వీడియోలో మీకు నచ్చిన భాగాన్ని షేర్ చేసుకునేందుకు వీలుగా యూట్యూబ్‌ గతేడాది చాప్టర్స్‌ అనే ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. కానీ యూట్యూబ్‌ మొబైల్‌ యాప్‌లో ఈ ఫీచర్‌ పనితీరుపై యూజర్స్ అసంతృప్తి వ్యక్తం చేయడంతో తాజాగా ఈ ఫీచర్‌కు యూట్యూబ్‌ సరికొత్త హంగులు జోడించింది. దానివల్ల యూజర్స్ మొబైల్ యాప్‌ నుంచే వీడియోలో తమకు నచ్చిన భాగాన్ని ఇతరులతో షేర్ చేసుకోవచ్చు. ప్రస్తుతం ఆండ్రాయిడ్ యూజర్స్‌కి మాత్రమే ఈ ఫీచర్‌ అందుబాటులో ఉంది. త్వరలోనే యూజర్స్‌ అందరికీ అందుబాటులోకి తీసుకురానున్నారు. 

ఈ ఫీచర్‌ కోసం ముందుగా మీరు షేర్ చేయాలనుకున్న వీడియో డెస్క్రిప్షన్‌లోకి వెళ్లి సదరు వీడియోలో చాప్టర్స్‌ ఉన్నాయా? లేదా? చెక్ చేసుకోవాలి (పైఫోటోలో చూపిన విధంగా). ఒకవేళ వీడియో చాప్టర్స్‌గా ఉంటే అందులో మీకు నచ్చిన భాగాన్ని ఎంపికచేసుకుని దాన్ని మాత్రమే షేర్ చేసుకుంటే సరిపోతుంది. గతంలో యూట్యూబ్ వీడియోలను మొబైల్‌లో షేర్ చేయాలంటే లింక్‌ పంపి.. ఎన్నో నిమిషం నుంచి వీడియో చూడాలనేది చెప్పేవారు. కానీ ఈ కొత్త ఫీచర్‌తో మీకు నచ్చిన భాగాన్ని మాత్రమే ఎంపికచేసి పంపే వెసులుబాటు కలుగుతోంది.

ఇవీ చదవండి


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

తాజా వార్తలు

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

దేవ‌తార్చ‌న