YouTube: యూట్యూబ్ కొత్త సబ్‌స్క్రిప్షన్ ప్లాన్.. ధరెంతంటే?
close

Published : 03/08/2021 09:10 IST
YouTube: యూట్యూబ్ కొత్త సబ్‌స్క్రిప్షన్ ప్లాన్.. ధరెంతంటే?

ఇంటర్నెట్‌ డెస్క్‌: నేర్చుకోవాలనే ఆసక్తి, తపన ఉంటే చాలు.. ఎన్నో రకాల మార్గాలున్నాయి. అలాంటి వారికి యూట్యూబ్‌ ఉత్తమ వేదిక. అయితే ఇందులో వచ్చే యాడ్స్ మనకు కొంచెం చికాకు కలిగిస్తాయి. అందుకే యాడ్‌-ఫ్రీ స్ట్రీమింగ్ కోరుకునే వారికోసం గూగుల్ యూట్యూబ్ ప్రీమియం సేవలను అందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సబ్‌స్క్రిప్షన్ తీసుకున్నవారికి యూట్యూబ్‌లో యాడ్స్ ఉండవు. వీడియోలను సులువుగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అలాగే యూట్యూబ్ మ్యూజిక్ ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ ఉచితం. బ్యాగ్రౌండ్ ప్లేబ్యాక్ ఫీచర్ కూడా ఉంది. అంటే మీరు యూట్యబ్‌లో వీడియో ప్లే చేసి మరో యాప్ ఓపెన్‌ చేసినా బ్యాక్‌గ్రౌండ్‌లో సదరు వీడియో ప్లే అవుతూనే ఉంటుంది. దీనికి నెలవారీ సబ్‌స్క్రిప్షన్ రుసుము రూ. 139, 3 నెలలకు రూ. 399 చెల్లించాలి. తాజాగా యూట్యూబ్ ప్రీమియం లైట్ పేరుతో మరో కొత్త సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌ను తీసుకొస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఈ ఫీచర్‌ను బెల్జియం, డెన్మార్క్‌, ఫిన్‌లాండ్, లక్సెంబర్గ్, నెదర్లాండ్స్‌, నార్వే, స్వీడన్‌లలో పరీక్షిస్తున్నామని యూట్యూబ్ అధికారిక ప్రతినిధి తెలిపారు. 

యూట్యూబ్ ప్రీమియం లైట్‌ సబ్‌స్క్రిప్షన్‌తో వెబ్‌, ఐఓఎస్‌, ఆండ్రాయిడ్, స్మార్ట్‌ టీవీ, గేమింగ్ కన్సోల్‌, యూట్యూబ్ కిడ్స్‌ యాప్‌లలో యాడ్స్‌ లేకుండా చూడొచ్చట. బ్యాక్‌గ్రౌండ్ ప్లే బ్యాక్, డౌన్‌లోడ్ వంటి ఫీచర్లతోపాటు యూట్యూబ్‌ మ్యూజిక్ యాడ్‌-ఫ్రీ ఉండదని తెలిపారు. త్వరలోనే యూట్యూబ్ ప్రీమియం లైట్ సబ్‌స్క్రిప్షన్ ఫీచర్‌ను భారత మార్కెట్లో ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుత సమాచారం ప్రకారం అంతర్జాతీయ మార్కెట్లో యూట్యూబ్ ప్రీమియం లైట్‌ ధర 6.99 యూరోలు ఉంటుందట. భారత మార్కెట్లో ప్రీమియం లైట్‌ సబ్‌స్క్రిప్షన్ నెలకు సుమారు రూ.70 నుంచి రూ.75కి అందుబాటులో ఉంటుందని మార్కెట్‌ వర్గాల అంచనా. అయితే 50 శాతం సబ్‌స్క్రిప్షన్ ఛార్జీలతో కేవలం ఒక ఫీచర్‌నే అందిస్తుందడంపై యూజర్స్‌ నుంచి అభ్యంతరాలు వ్యక్తమయ్యే అవకాశంలేకపోలేదని యూట్యూబ్ భావిస్తోంది. దీనికి మరికొన్ని ఫీచర్స్ చేర్చి మరో కొత్త తరహా సబ్‌స్క్రిప్షన్ ప్లాన్ అందుబాటులోకి తీసుకొచ్చే అవకాశం ఉందంటున్నాయి మార్కెట్ వర్గాలు.

ఇవీ చదవండి


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

తాజా వార్తలు

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

దేవ‌తార్చ‌న