Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 219009517
            [news_title_telugu_html] => 

దుబారాకు దూరం

[news_title_telugu] => దుబారాకు దూరం [news_title_english] => [news_short_description] => ఆర్థిక మాంద్యం ప్రభావం తీవ్రంగా ఉన్నప్పటికీ సంక్షేమ రంగాలకు ఎలాంటి ఇబ్బందీ లేకుండా చూస్తామని తెలంగాణ ఆర్థికమంత్రి తన్నీరు హరీశ్‌రావు స్పష్టం చేశారు. చాలా కాలం క్రితమే ఆర్థిక మాంద్యం తలెత్తినా ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కేంద్రం దాన్ని బయటపడనీయలేదని ఆరోపించారు. ఈ ప్రభావం వల్ల మిగతా రంగాల్లో కొంత వ్యయం తగ్గించినా.. [news_tags_keywords] => [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => | [news_videoinfo] => | [news_sections] => ,27,26, ) )
దుబారాకు దూరం - EENADU
close
దుబారాకు దూరం

మాంద్యం నేపథ్యంలో ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తాం
ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు కానుకలుండవు
బడ్జెట్‌ సమావేశాల విందు కూడా రద్దు
సంక్షేమ పథకాలు యథాతథంగా కొనసాగుతాయి
కేంద్రం నుంచి రావాల్సిన నిధులు రాబడతా
‘ఈనాడు’ ముఖాముఖిలో ఆర్థికమంత్రి హరీశ్‌రావు

కేంద్రం మాంద్యాన్ని దాచిపెట్టింది

18 నెలల నుంచి ఆర్థిక మాంద్యం ఉన్నా కేంద్ర ప్రభుత్వం సాధారణ ఎన్నికల వరకు దాచిపెట్టి తర్వాత బయటపెట్టింది. ఓటాన్‌ అకౌంట్‌లో ఎక్కువ బడ్జెట్‌ పెట్టుకున్నా.. ఇప్పుడు వాస్తవాలు బయటపడటంతో దానిని దృష్టిలో పెట్టుకొని ముఖ్యమంత్రి ఉన్నది ఉన్నట్లు చెప్పాలని.. చెప్పినవి చేయాలనే లక్ష్యంతో బడ్జెట్‌కు రూపకల్పన చేశారు.

రాష్ట్రానికి అదనంగా ఇచ్చిందేం లేదు

రాష్ట్రం నుంచి కేంద్రానికి పోయింది ఎక్కువ, వచ్చింది తక్కువ. చట్టం ప్రకారం రావల్సిన నిధులు కూడా ఇవ్వడం లేదు. పునర్విభజన చట్టం ప్రకారం వెనకబడిన ప్రాంతాల అభివృద్ధికి సంబంధించి గ్రాంటు రూ. 500 కోట్లు రాలేదు. కేంద్రం నుంచి రాష్ట్రానికి రాజ్యాంగబద్ధంగా రావల్సింది వచ్చింది తప్ప అదనంగా, ప్రత్యేకంగా వచ్చింది ఏమీ లేదు.

పన్నుల భారం లేకుండా చూస్తా

ప్రజలపై పన్నుల భారం లేకుండా ఉన్న పరిమితుల్లోనే ఆదాయాన్ని పెంచే మార్గాలను అన్వేషిస్తాం. ముఖ్యమంత్రి ఆలోచనలకు అనుగుణంగా అవినీతి లేకుండా చూడటంతోపాటు లబ్ధిదారులకు పథకాలు చేరడానికి తగిన చర్యలు తీసుకుంటాం. దళారీ వ్యవస్థకు అవకాశం లేకుండా చూస్తాం.

ఆర్థిక మాంద్యం ప్రభావం తీవ్రంగా ఉన్నప్పటికీ సంక్షేమ రంగాలకు ఎలాంటి ఇబ్బందీ లేకుండా చూస్తామని తెలంగాణ ఆర్థికమంత్రి తన్నీరు హరీశ్‌రావు స్పష్టం చేశారు. చాలా కాలం క్రితమే ఆర్థిక మాంద్యం తలెత్తినా ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కేంద్రం దాన్ని బయటపడనీయలేదని ఆరోపించారు. ఈ ప్రభావం వల్ల మిగతా రంగాల్లో కొంత వ్యయం తగ్గించినా.. సంక్షేమ కార్యక్రమాలను యథాతథంగా అమలు చేయాలనేది ముఖ్యమంత్రి నిర్ణయమని చెప్పారు. అందుకు అనుగుణంగానే బడ్జెట్‌ ఉందని చెప్పారు. స్వీయ ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తూ దుబారా ఖర్చులు లేకుండా చూస్తామన్నారు. ఇందులో భాగంగా బడ్జెట్‌ సమావేశాల్లో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు కానుకల పంపిణీ, విందు వంటివి రద్దు చేస్తున్నామని హరీశ్‌రావు తెలిపారు. ఆర్థికమంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఆయన ‘ఈనాడు’కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. అందులోని ముఖ్యాంశాలివి..

మాంద్యం తీవ్రంగా ఉన్న  పరిస్థితులలో ఆర్థికమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఈ సవాలును ఎలా ఎదుర్కొంటారు?
రాష్ట్రం ఏర్పడినపుడు 13.57 శాతం ఉన్న వృద్ధిరేటు 21.49 శాతానికి పెరిగింది. గత రెండు త్రైమాసికాల నుంచి 7.71 శాతానికి పడిపోయింది. కేంద్రంలో గత ఆరు త్రైమాసికాల నుంచి తగ్గుతూ వచ్చింది. 2018 ఏప్రిల్‌-జూన్‌లో 8 శాతం ఉంటే, ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి 5.8 శాతానికి పడిపోయింది. 2019 మొదటి త్రైమాసికంలో వృద్ధిరేటు 5 శాతం మాత్రమే. ఇది మనపైనా చాలా తీవ్రమైన ప్రభావాన్ని చూపింది. ఓటాన్‌ అకౌంట్‌ పెట్టినప్పటికీ ఇప్పటికీ చాలా తగ్గిపోయింది. ఈ వాస్తవాలన్నింటినీ ముఖ్యమంత్రి ప్రజల దృష్టికి తెచ్చారు.

రాష్ట్రంలో అభివృద్ధి పనులపై మాంద్యం ప్రభావం ఎలా ఉంటుందంటారు?
కొంత ప్రభావం ఉంటుంది. మిగతా రంగాల్లో కేటాయింపులు తగ్గించుకున్నా, రైతాంగం, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల సంక్షేమం ఎప్పటిలాగే కొనసాగించాలన్నది సీఎం ఆలోచన. రైతు సంక్షేమం, ఇతర సంక్షేమ పథకాలు, ఆరోగ్యం తదితర రంగాలకు ప్రాధాన్యం ఇస్తాం. రైతుబంధు యథాతథంగా కొనసాగుతుంది. స్థానిక సంస్థలకు కూడా అధిక ప్రాధాన్యం ఇచ్చాం. మాంద్యాన్ని దృష్టిలో పెట్టుకొని స్వీయ ఆర్థిక క్రమశిక్షణను పాటిస్తాం. దుబారా ఖర్చులు చేయం.

స్వీయ ఆర్థిక క్రమశిక్షణ అంటున్నారు కదా.. ఏం చేస్తారు?
ఇది మా శాఖ నుంచే ప్రారంభమవుతుంది. ఏటా బడ్జెట్‌ సమావేశాల్లో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు కొన్ని కానుకలు ఇచ్చే సంప్రదాయముంది. మాంద్యం దృష్ట్యా ఈసారి ఎలాంటి కానుకలు ఉండవు. బడ్జెట్‌ సమావేశాల ముగింపు రోజున ప్రజాప్రతినిధులు, అధికారులకు విందు ఏర్పాటు చేసేవారు. ఈ ఏడాది అది కూడా ఉండదు. ఇవి ప్రారంభం మాత్రమే. దుబారా ఖర్చులు లేకుండా చూడటానికి అన్ని రకాల చర్యలు తీసుకుంటాం.

నిధులు సకాలంలో.. సక్రమంగా ఖర్చు చేస్తున్నారో, లేదో చూసే అవకాశం ఉందా?
పంచాయతీలు, పురపాలక సంఘాలు, వర్సిటీలు, దేవాదాయ తదితర శాఖల్లో రూ. 6,200 కోట్లకు సంబంధించిన ఆడిట్‌ పేరాలు పెండింగ్‌లో ఉన్నాయి. వాటిని పూర్తి చేసి రికవరీ చేయాల్సి ఉంది. సర్పంచి దుర్వినియోగానికి పాల్పడితే అతని పదవీ కాలంలోగా ఎలాంటి చర్య తీసుకోలేకపోతే ఏం లాభం? ఈ ప్రక్రియను సత్వరమే పూర్తి చేయడానికి ప్రణాళికతో పని చేస్తాం. నిధుల వినియోగం పటిష్ఠంగా జరగడానికి ఇది దోహదపడుతుంది.

తొమ్మిది నెలల తర్వాత మళ్లీ మంత్రివర్గంలోకి వచ్చారు. మీకేమనిపిస్తుంది ?
నేనెప్పుడూ ప్రజాక్షేత్రంలోనే ఉన్నాను. రోజుకు 18 గంటలు పని చేశాను. ముఖ్యమంత్రి కేసీఆర్‌ తిరిగి మంత్రిగా అవకాశం కల్పించారు. రాష్ట్రం, ఉమ్మడి మెదక్‌ జిల్లా, నియోజకవర్గం అభివృద్ధికి పాటుపడతాను. ఎక్కువ ఆదాయం వచ్చే శాఖలతో సమన్వయం ద్వారా ఆదాయం పెంచడానికి ప్రయత్నిస్తా. కేంద్రం నుంచి రావాల్సిన నిధులు రాబట్టడం, మ్యాచింగ్‌ గ్రాంటు అందేలా చూడటానికి చర్యలు తీసుకుంటాం.

అనేక శాఖల్లో పెండింగ్‌ బిల్లులు ఎక్కువగా ఉన్నాయి. ఎప్పుడు చెల్లింపులు జరుగుతాయి ?
ఈ విషయంలో సంబంధిత మంత్రులతో సమన్వయం చేసుకుంటాం. కార్యదర్శుల స్థాయిలోనే కాకుండా మంత్రులతో కూడా ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ నిధుల విడుదలకు చర్యలు తీసుకుంటాం. మంత్రులందరికీ ఆర్థికపరమైన అంశాల్లో కూడా పట్టుండాలన్నది ముఖ్యమంత్రి అభిప్రాయం. బడ్జెట్‌లో పెండింగ్‌ బిల్లుల అంశాన్ని కూడా పరిగణనలోకి తీసుకున్నాం. దీనికి తగ్గట్లుగా కేటాయింపులు జరిగాయి. దశలవారీగా చెల్లింపులు చేస్తాం.

కేంద్రం తెలంగాణకు ఎక్కువ నిధులు ఇచ్చిందని, వాటిని   సక్రమంగా వినియోగించలేదని భాజపా నేతలు చెబుతున్నారు కదా?
అన్నిటికీ లెక్కలు ఉంటాయి. గత ఐదేళ్లలో సెంట్రల్‌ ఎక్సైజ్‌, ఆదాయపు పన్ను, సర్వీసు ట్యాక్స్‌, జీఎస్టీ మొదలైన వాటి ద్వారా రాష్ట్రం నుంచి కేంద్రానికి కట్టింది రూ. 2,72,926 కోట్లు. ఇందులో తిరిగి రాష్ట్రానికి వచ్చింది రూ. 31,800 కోట్లు. కేంద్రం నుంచి రాజ్యాంగబద్ధంగా రావల్సింది వచ్చింది తప్ప అదనంగా వచ్చిందేం లేదు.

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.