Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 219009522
            [news_title_telugu_html] => 

పరిసరాల పరిశుభ్రతపై ప్రకటనలివ్వండి

[news_title_telugu] => పరిసరాల పరిశుభ్రతపై ప్రకటనలివ్వండి [news_title_english] => [news_short_description] => వైరల్‌, డెంగీ జ్వరాలకు కారణమైన దోమల నివారణకు, పరిసరాల పరిశుభ్రతపై సినిమా థియేటర్లు, కేబుల్‌ టీవీల్లో ప్రకటనలు ఇస్తూ ప్రజల్లో అవగాహన కల్పించాలని రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ జిల్లా అధికారులను ఆదేశించారు. బుధవారం ఆయన మహబూబాబాద్‌ జిల్లా ఆసుపత్రిని సందర్శించారు. ఆసుపత్రిలోని డయాలసిస్‌ కేంద్రం, ఐసీయూ, జనరల్‌, ఎస్‌ఎన్‌సీయూ వార్డులను పరిశీలించారు. [news_tags_keywords] => [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => [news_sections] => ,30,29, ) )
పరిసరాల పరిశుభ్రతపై ప్రకటనలివ్వండి - EENADU
close
పరిసరాల పరిశుభ్రతపై ప్రకటనలివ్వండి

  వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌

ఈనాడు డిజిటల్‌, మహబూబాబాద్‌: వైరల్‌, డెంగీ జ్వరాలకు కారణమైన దోమల నివారణకు, పరిసరాల పరిశుభ్రతపై సినిమా థియేటర్లు, కేబుల్‌ టీవీల్లో ప్రకటనలు ఇస్తూ ప్రజల్లో అవగాహన కల్పించాలని రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ జిల్లా అధికారులను ఆదేశించారు. బుధవారం ఆయన మహబూబాబాద్‌ జిల్లా ఆసుపత్రిని సందర్శించారు. ఆసుపత్రిలోని డయాలసిస్‌ కేంద్రం, ఐసీయూ, జనరల్‌, ఎస్‌ఎన్‌సీయూ వార్డులను పరిశీలించారు. చికిత్స పొందుతున్న రోగులతో మాట్లాడి ఆసుపత్రిలో అందుతున్న వైద్యసేవలపై అడిగి తెలుసుకున్నారు. డయాలసిస్‌ కేంద్రంలో అవసరమైన పరికరాలు లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని వైద్యులు మంత్రి దృష్టికి తీసుకురాగా వాటిని ఏర్పాటు చేయిస్తానని హామీ ఇచ్చారు. అనంతరం కలెక్టరేట్‌లో నిర్వహించిన సమీక్ష సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. వైద్యులు, సిబ్బంది అంతా నెలపాటు పగలు, రాత్రి కష్టపడి పనిచేయాలన్నారు. ప్రస్తుతం వస్తున్న జ్వరాలన్నీ డెంగీ జ్వరాలు కాదని, 98 శాతం వైరల్‌ జ్వరాలేనన్నారు. సమావేశంలో పంచాయతీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, జడ్పీ ఛైర్‌పర్సన్‌ బిందు, ఎంపీ కవిత, ఎమ్మెల్యేలు రెడ్యానాయక్‌, శంకర్‌నాయక్‌ తదితరులు పాల్గొన్నారు.

రాష్ట్ర వార్తలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.