close
వినూత్న ఆలోచనలతో రైతుల ఆదాయవృద్ధి

గవర్నర్‌ తమిళిసై

ఈనాడు, హైదరాబాద్‌: ‘‘నేను ఎప్పుడూ మల్లెపూలు ధరిస్తాను. తమిళనాడులో మదురై మల్లెపూలకు ఎంతో పేరుంది. ఎప్పుడు అక్కడికి వెళ్లినా మార్కెట్‌కు వెళ్లి కొనడం అలవాటు. ఒక్కోసారి నేను హడావుడి వల్ల వాటిని కొనలేక పోతున్నానని, అక్కడి ఓ యువరైతు విమానాశ్రయంలోనే మల్లెపూలు విక్రయించడం మొదలుపెట్టారు. ఇలాంటి వినూత్న ఆలోచనలతో రైతులకు ఆదాయం పెరుగుతుంది’’ అని గవర్నర్‌ తమిళిసై వివరించారు. ప్రొఫెసర్‌ జయశంకర్‌ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో సోమవారం నుంచి ప్రారంభమైన 2 రోజుల జాతీయ వ్యవసాయ సదస్సుకు ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ..‘‘నేను ఒకసారి అట్లాంటా వెళ్లా. అక్కడ ఓ పురుగు శిల్పం ఉంది. దాన్ని ఎందుకు పెట్టారని అడిగా. వారు చెప్పిన సమాధానం నాకు ఆశ్చర్యం కలిగించింది. ‘గతంలో మేం పత్తి  సాగుచేశాం. ఈ పురుగు వ్యాపించి పంటను నాశనం చేయడంతో  నష్టపోయాం. ఒక వృద్ధుడు ఆలోచించి భూమిపై ఉండే పత్తిని పురుగు తింటోంది. భూమిలోపల ఉండే పంటను వేస్తే తినలేదు అని చెప్పారు. అప్పటి నుంచి నేలలోపల పండే వేరుసెనగ  పండిస్తూ ధనవంతులమయ్యాం. అందుకే ఈ శిల్పం పెట్టాం’ అని చెప్పారు. ఇలాంటి వినూత్న ఆలోచనలు వ్యవసాయానికి అవసరం. వ్యవసాయంలో నూతనత్వం, ఆకర్షణీయత ఉంటే యువత ఈ రంగంవైపు వస్తారు’’ అని గవర్నర్‌ చెప్పారు. వ్యవసాయ మంత్రి నిరంజన్‌రెడ్డి, వర్సిటీ వీసీ ప్రవీణ్‌రావు, ఇక్రిశాట్‌ డీజీ పీటర్‌కార్బెరీ, పలువురు ప్రముఖులు  పాల్గొన్నారు.

 

రాష్ట్ర వార్తలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.