close
రాజధానిలో నామమాత్రం

హైదరాబాద్‌లో 18 అద్దె బస్సులకే టెండర్లు
జిల్లాల్లో పది వేల వరకు దాఖలు

ఈనాడు, హైదరాబాద్‌: అద్దె బస్సులకు జిల్లాల్లో భారీగా స్పందన లభించగా.. గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో అంతంతమాత్రంగానే ఉంది. ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో 1,035 బస్సులను అద్దె ప్రాతిపదికన తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం కొన్ని మార్గాలను ఖరారు చేసింది. టెండర్లు దాఖలు చేసేందుకు సోమవారం చివరి గడువుగా ఆర్టీసీ ప్రకటించింది. గడువు ముగిసే సమయానికి సుమారు పది వేల వరకు టెండర్లు దాఖలయ్యాయి. టెండర్ల దాఖలు సందర్భంగా ఆదిలాబాద్‌, కరీంనగర్‌, వరంగల్‌ తదితర ప్రాంతాల్లో కార్మికులు ప్రతిఘటించారు. అద్దె బస్సులను తీసుకోవద్దని డిమాండ్‌ చేశారు. కరీంనగర్‌లో టెండర్ల దాఖలుకు వచ్చిన వారే నిరసన వ్యక్తంచేశారు. పాత గుత్తేదారులకు అనుకూలంగా నిబంధనలు రూపొందించారంటూ ఆందోళన చేశారు. ప్రభుత్వం టెండర్లు ఆహ్వానించిన 1,035 బస్సుల్లో 760 గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలోవి కాగా మిగిలిన 275 జిల్లాల్లో ఉన్నాయి. హైదరాబాద్‌ పరిధిలో బస్సులు నడిపేందుకు ప్రభుత్వం నిర్ణయించిన ధరలు గిట్టుబాటు కావంటూ టెండర్ల దాఖలుకు యజమానులు ఆసక్తి చూపలేదు. రాజధానిలో 18 బస్సులకే టెండర్లు దాఖలయ్యాయి. మిగిలిన ప్రాంతాల్లో పది వేల వరకు దరఖాస్తులొచ్చాయి. జిల్లాల్లో సగటున 45 నుంచి 50 బస్సుల వరకు ఉన్నాయి. కరీంనగర్‌, వరంగల్‌ జిల్లాల్లో అధిక సంఖ్యలో టెండర్లు దాఖలయ్యాయి. బస్సుల కన్నా టెండర్ల సంఖ్య ఎక్కువగా ఉండటంతో లాటరీ ద్వారా గుత్తేదారుల ఎంపికకు అధికారులు కసరత్తు చేస్తున్నారు.

రాష్ట్ర వార్తలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.