close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
శాంతిభద్రతల పరిరక్షణలో ఐపీఎస్‌లు కీలకం

ఈనాడు, హైదరాబాద్‌: ఐపీఎస్‌ అధికారులు శాంతిభద్రతలను నెలకొల్పడంలో కీలకపాత్ర పోషిస్తున్నారని మర్రి చెన్నారెడ్డి మానవవనరుల అభివృద్ధి సంస్థ డైరెక్టర్‌ జనరల్‌ బి.పి.ఆచార్య అన్నారు. హైదరాబాద్‌లోని ఈ సంస్థలో బుధవారం ఐపీఎస్‌ ప్రొబేషనర్లకు ప్రత్యేక శిక్షణను ప్రారంభించారు. ఈ సందర్భంగా బీపీ ఆచార్య మాట్లాడుతూ సమాజంలో నిజమైన గొప్ప మార్పు తెచ్చే సామర్థ్యం ఐపీఎస్‌లకు ఉందన్నారు. భూరికార్డులు, భూములకు సంబంధించిన చట్టాలు, విధానాలపై ప్రొబేషనర్లకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా సివిల్‌్ సర్వీసెస్‌లో 46వ ర్యాంకు సాధించి, తెలంగాణ టాపర్‌గా నిలిచిన ఐపీఎస్‌ ప్రొబేషనరీ అధికారిణి పెద్దిటి ధాత్రిరెడ్డిని ఆయన అభినందించారు.

రాష్ట్ర వార్తలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.