close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
పచ్చదనం పెంపునకు విత్తన గణపతులు

రాజ్యసభ సభ్యుడు సంతోష్‌కుమార్‌ వినూత్న కార్యక్రమం
మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి చేతుల మీదుగా విగ్రహాల ఆవిష్కరణ

ఈనాడు, హైదరాబాద్‌: హరితహారం స్ఫూర్తితో హరిత సవాలు కార్యక్రమం నిర్వహిస్తున్న రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్‌కుమార్‌ వినాయక చవితిని పురస్కరించుకొని మరో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. మట్టిలో వేప విత్తనాన్ని కలిపి గణపతి విగ్రహాలను తయారు చేయించారు. ఈ విగ్రహంలోని విత్తనం ఐదు నుంచి ఏడు రోజుల్లో మొలకెత్తుతుంది. మరో వారంలో పూర్తిస్థాయి మొక్కగా మారుతుంది. ఇంట్లోనే విగ్రహ నిమజ్జనం తర్వాత ఈ వేప మొక్కను అందరూ తమ ఇంటి ఆవరణలో నాటుకోవచ్చు. బుధవారం ప్రగతిభవన్‌లో అటవీ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి చేతులమీదుగా విత్తన గణపతి విగ్రహాలను లాంఛనంగా ఆవిష్కరించారు. మంత్రిమండలి సమావేశం సందర్భంగా మంత్రులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సంతోష్‌ను ఇంద్రకరణ్రెడ్డి అభినందించారు. ఆధ్యాత్మికతకు ప్రకృతి, పర్యావరణ రక్షణను జోడించటం, ప్రతి ఇంటి ఆవరణలో ఔషధ గుణాలున్న వేప చెట్టు ఉండాలన్న ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆశయ సాధన ఈ కార్యక్రమం సంకల్పమని సంతోష్‌ పేర్కొన్నారు. హరిత సవాలులో భాగంగా గో గ్రామీణ భారత్‌ సంస్థతో కలిసి విగ్రహాల పంపిణీ మొదలుపెడతామన్నారు.

రాష్ట్ర వార్తలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.