Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 219009423
            [news_title_telugu_html] => 

పాదచారుల వంతెనపై రయ్‌రయ్‌

[news_title_telugu] => పాదచారుల వంతెనపై రయ్‌రయ్‌ [news_title_english] => [news_short_description] => మహానగరాల్లో ఉండే ట్రాఫిక్‌లో రోడ్డు దాటాలంటే ఇబ్బందే. అందుకోసమే ప్రభుత్వాలు పాదచారుల కోసం ప్రత్యేక వంతెనలు నిర్మిస్తాయి. [news_tags_keywords] => [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => [news_sections] => ,33,32, ) )
పాదచారుల వంతెనపై రయ్‌రయ్‌ - EENADU
close
పాదచారుల వంతెనపై రయ్‌రయ్‌

దిల్లీ: మహానగరాల్లో ఉండే ట్రాఫిక్‌లో రోడ్డు దాటాలంటే ఇబ్బందే. అందుకోసమే ప్రభుత్వాలు పాదచారుల కోసం ప్రత్యేక వంతెనలు నిర్మిస్తాయి. దిల్లీ స్వరూప్‌నగర్‌లోని చండీగఢ్‌ జాతీయ రహదారిపై ఉన్న పాదచారుల వంతెనపై మాత్రం కొద్దిరోజులుగా ద్విచక్ర వాహనాలు దూసుకెళుతున్నాయి. ఈ పాదచారుల వంతెన దాటితే ఓ పోలీసు చెక్‌పోస్ట్‌ ఉంటుంది. హెల్మెట్‌, వాహనానికి సంబంధించిన కాగితాలు లేనివారు అటుగా వెళితే జరిమానా తప్పదు. అందుకే ఈ వంతెనను ఇలా అడ్డదారిగా వినియోగిస్తూ పోలీసులకే చుక్కలు చూపిస్తున్నారు కొందరు ద్విచక్ర వాహనదారులు. దూరాన్ని తగ్గించుకునేందుకే ఇలా వంతెన పైనుంచి వెళుతున్నామని చెబుతున్నారు. ఈ వంతెనకు పది అడుగుల దూరంలోనే పోలీస్‌స్టేషన్‌ ఉన్నా చర్యలు శూన్యం. వాహనాల రద్దీ పెరగడంతో వంతెన సైతం దెబ్బతింటోంది.

కథనాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.