close
అసాధారణ క్యాన్సర్‌ కణతుల గుట్టు రట్టు

స్టాక్‌హోం: అసాధారణంగా విస్తరిస్తూ, తీవ్ర ముప్పుగా పరిణమించే క్యాన్సర్‌ కణతులను... ఇట్టే పసిగట్టే సరికొత్త వైద్య పరీక్ష విధానాన్ని స్వీడన్‌ పరిశోధకులు కనుగొన్నారు. ఒకే రకమైన క్రోమోజోములతో కూడిన కణాలు నిరాటంకంగా విచ్ఛిన్నం కావడంతో కణతులు ఏర్పడతాయి. ఈ ప్రక్రియను కాపీ నంబర్‌ ఆల్ట్రేషన్స్‌ (సీఎన్‌ఏ) అంటారు. అయితే కొన్ని కణతులు భిన్నమైన క్రోమోజోములతో విస్తరిస్తుంటాయి. ఇలాంటి ‘హెట్రోజీనియస్‌ ట్యూమర్‌’లను గుర్తించేందుకు సీయూటీసెక్‌ అనే సరికొత్త విధానాన్ని పరిశోధకులు అభివృద్ధి చేశారు. ఈ విధానంలో ఒకే కణతికి చెందిన వివిధ భాగాల నుంచి డీఎన్‌ఏను సేకరించి, విశ్లేషిస్తామని కరోలిన్‌స్కా ఇన్‌స్టిట్యూట్‌కు చెందిన ప్రధాన పరిశోధనకర్త నికోలా క్రోసెటో తెలిపారు.

కథనాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.