close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
జగమంతా రామమయం

దిల్లీ: అయోధ్యలో భవ్య రామమందిర నిర్మాణానికి భూమి పూజ సందర్భాన్ని పురస్కరించుకుని దేశ, విదేశాల్లోని ఆలయాల్లో భక్తులు ప్రత్యేక పూజలు, భజనలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయాలన్నీ దేదీప్యమానంగా వెలిగిపోయాయి. గోపురాలపై కాషాయ పతాకాలు రెపరెపలాడాయి. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ప్రజలు బుధవారం రాత్రి తమ వాకిళ్లలో మట్టి ప్రమిదల్లో దీపాలు వెలిగించారు. బాణసంచా కాల్చారు. కొన్ని చోట్ల దీపావళి ముందే వచ్చిందా అన్న రీతిలో వేడుకలు జరిగాయి.  విశ్వహిందూ పరిషత్‌ (వీహెచ్‌పీ) అమెరికా శాఖ వాషింగ్టన్‌లోని కేపిటల్‌ హిల్‌ చుట్టూ వ్యాన్‌లో డిజిటల్‌ బోర్డులపై రాముడి చిత్రాలను ప్రదర్శిస్తూ ఊరేగింపు నిర్వహించింది. అనంతరం ప్రదర్శన నగర వీధుల్లో కొనసాగింది. ఈ సందర్భంగా పలువురు సభ్యులు ‘జై శ్రీరామ్‌’ అంటూ పెద్దఎత్తున నినాదాలు చేశారు.  న్యూయార్క్‌ టైమ్స్‌ స్క్వేర్‌ వద్ద డిజిటల్‌ బోర్డుపై రాముడు, అయోధ్య ఆలయం, భారతీయ జాతీయ పతకాన్ని ప్రదర్శించారు.చాలా నగరాల్లోని హిందువులు ఇళ్ల వద్ద దీపాలు వెలిగించారు. కరోనా మహమ్మారి నేపథ్యంలో బహిరంగ కార్యక్రమాలను పరిమితంగా నిర్వహించాల్సి వచ్చింది. బ్రిటన్‌వ్యాప్తంగా ఉన్న పలు ఆలయాల్లో భారతీయులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.  అమెరికాలోని దిల్లీలోని ఛతర్‌పుర్‌ ఆలయానికి ఉదయం ఆరు గంటల నుంచే భక్తుల రాక మొదలైంది. ‘‘మూడు రోజులగా నిరంతరాయంగా పూజ కొనసాగుతోంది. రామ్‌ దర్బార్‌ను ప్రత్యేకంగా అలంకరించాం. శంకుస్థాపన రాయిని సిద్ధం చేశాం. దీనిని ఇతర సామగ్రితోపాటు అయోధ్యకు పంపిస్తాం’’ అని ఆలయ పరిపాలన అధికారి కిశోర్‌ చావ్లా తెలిపారు. మథురలోని కృష్ణ దేవాలయంలో భక్తులు దీపాలు వెలిగించారు. పాకిస్థాన్‌ నుంచి శరణార్థులుగా వచ్చిన హిందువులు దిల్లీలోని తమ నివాసాల వద్ద దీపాలు వెలిగించారు.

కథనాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.