close

తాజా వార్తలు

డెంగ్యూపై అవగాహన ర్యాలీ

ఖమ్మం వైద్యవిభాగం: జాతీయ కీటక వ్యాధుల నివారణ కార్యక్రమంలో భాగంగా గురువారం ఖమ్మంలో డెంగ్యూ అవగాహన ప్రదర్శన నిర్వహించారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ ప్రదర్శనను స్థానిక పెవిలియన్ మైదానంలో డీ.ఎం.హెచ్‌.ఓ డాక్టర్‌ కళావతిభాయ్‌, నగరపాలక సంస్థ కమిషనర్‌ శ్రీనివాసరావు ప్రారంభించారు. ఇక్కడ నుంచి కార్యక్రమంలో భాగంగా మయూరి సెంటర్‌ వైరా రోడ్ మీదుగా ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రి వరకూ ప్రదర్శన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. దోమల నివారణ కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించడంతో పాటు ఇంటి ఆవాసాలలో నీటి నిల్వలను ఎప్పటికప్పుడు తొలగించాలని ప్రజలకు సూచించారు. ఏడీస్ దోమ వ్యాప్తికి గల కారణాలను విశ్లేషించారు. ఈ కార్యక్రమంలో పెద్దాసుపత్రి సూపరింటెండెంట్‌ వెంకటేశ్వర్లు, ఆరోగ్యశాఖ వైద్యవిధాన పరిషత్‌ ఉద్యోగులు, నర్సింగ్‌ విద్యార్థులు పాల్గొన్నారు. ప్రదర్శన అనంతరం ప్లకార్డు ప్రదర్శిస్తూ దోమల నివారణపై ప్రజలను చైతన్యపరిచారు.

 


జిల్లా వార్తలు

ఈటీవీ స్పెషల్

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.