Latest Telugu News, Headlines, Breaking News, Articles
close

తాజా వార్తలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

నిర్మల్‌, న్యూస్‌టుడే : నిర్మల్‌ జడ్పీ ఛైర్‌పర్సన్‌గా ఎనికైన కొరిపెల్లి విజయలక్ష్మి, వైస్‌ఛైర్‌పర్సన్‌ సాగరబాయి, కో-ఆప్షన్‌ సభ్యుడు డాక్టర్‌ యు.సుభాష్‌రావు, జడ్పీటీసీ సభ్యులు, నిర్మల్‌ ఎంపీపీగా ఎన్నికైన రామేశ్వర్‌రెడ్డి మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి ఆధ్వర్యంలో మంగళవారం హైదరాబాద్‌లోని ప్రగతిభవన్‌లో తెరాస కార్యనిర్వాహక రాష్ట్ర అధ్యక్షుడు కేటీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. జిల్లాలోని పెంబి మండలం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసి గెలుపొందిన జడ్పీటీసీ సభ్యురాలు బుక్యా జానుబాయి ఇటీవల తెరాసలో చేరడంతో ఆమె కేటీఆర్‌ను కలిసి మారుమూల మండలమైన పెంబి అభివృద్ధికి అధిక ప్రాధాన్యం ఇవ్వాలని విన్నవించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌ గెలిచిన అభ్యర్థులను అభినందించారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పనిచేయాలని వారికి సూచించారు. ప్రభుత్వ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ చేరేలా చూడాలని పేర్కొన్నారు. ఇందులో ముథోల్‌, ఖానాపూర్‌ ఎమ్మెల్యేలు విఠల్‌రెడ్డి, రేఖానాయక్‌, తెరాస ఉమ్మడి జిల్లా మాజీ అధ్యక్షుడు శ్రీహరిరావు, జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్‌ ఎర్రవోతు రాజేందర్‌ తదితరులు ఉన్నారు.


జిల్లా వార్తలు
మరిన్ని

ఈటీవీ స్పెషల్

దేవతార్చన