close

తాజా వార్తలు

ఉత్తమ సేవలకు పురస్కారం

కోర్టుచౌరస్తా(కరీంనగర్‌), న్యూస్‌టుడే : ఐకేపీ మహిళా సంఘాలకు బ్యాంకు రుణం మంజూరులో రాష్ట్రంలోనే ఉన్నతంగా నిలిపిన జిల్లా గ్రామీణ అభివృద్ధి-టీసెర్‌్్ప సంస్థ అధికారులకు శనివారం సెర్ప్‌ ప్రధాన కార్యాలయంలో జిల్లా గ్రామీణ అభివృద్ధి, పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు చేతులమీదుగా పురస్కారాలు అందజేశారు. 2018-19 ఏడాదికి రూ.180.79 కోట్ల లక్ష్యం కాగా అధిగమించి రూ.222.38 కోట్ల రుణాన్ని పంపిణీ చేసి మహిళలకు ఆర్థిక చేదోడునందించారు. ఈ సందర్భంగా జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి ఎ.వెంకటేశ్వరరావు, డీపీఎం వి.శ్రీనివాస్‌, ఏపీఎం సంతోష్‌రావు, సీసీ స్వరూపరాణిలను హైదరాబాద్‌లోని సెర్ప్‌ ప్రధాన కార్యాలయంలో మంత్రి, సెర్ప్‌ సీఈవో పౌసమిబసు, ఇతర అధికారుల చేతులమీదుగా పురస్కారం అందుకున్నారు. ఈ సందర్భంగా పురస్కారం అందుకున్న అధికారులకు జిల్లా సమాఖ్య ప్రతినిధులు, రేణుక, రమ, సుజాత, డ్వామా సూపరింటెండెంట్‌ శ్రీనివాస్‌, ఏపీడీ వెంకటేశ్వర్‌, డీపీఎం సీహెచ్‌ శ్రీనివాస్‌, ఇతర విభాగాల అధికారులు శుభాకాంక్షలు తెలిపారు.


జిల్లా వార్తలు

ఈటీవీ స్పెషల్

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.