Latest Telugu News, Headlines, Breaking News, Articles
close

తాజా వార్తలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

 బాలికల గురుకుల పాఠశాలలో దుస్థితి

సంగారెడ్డిలోని అంబేద్కర్‌ భవన్‌ పక్కనున్న మహాత్మా జ్యోతిబాఫులే బీసీ బాలికల గురుకుల పాఠశాలలో స్వచ్ఛత కరవైంది. ప్రతి శుక్రవారం ప్రభుత్వ కార్యాలయాల్లో స్వచ్ఛత కార్యక్రమాలు నిర్వహిస్తున్నా ఇక్కడ మచ్చుకైనా పరిశుభ్రత కనిపించడం లేదు. చెత్తాచెదారం పేరుకుపోయి ఎలుకలు విజృంభిస్తున్నాయి. ఆహార పదార్థాలతో పాటు బాలికలను కొరుకుతున్నాయి. ఇక్కడ కనిపిస్తున్న చిన్నారులు వెన్నెల, సంధ్య, మానసకు ఎలుకలు కరవడంతో ఆసుపత్రికి వెళ్లడానికి స్టాఫ్‌ నర్సు కోసం ఎదురుచూస్తున్నారు. అదే సమయంలో పాఠశాల ప్రిన్సిపల్‌ క్రిష్ట్రగౌడ్‌ వారిని వాకబు చేయగా.. ఎలుక కరిచింది సారూ అంటూ చూపించారు. అందులో ఇద్దరు జ్వరంతో బాధపడుతున్నారు. ఈ పరిస్థితిపై ప్రిన్సిపల్‌ను వివరణ కోరగా.. తాను ఐదు రోజుల క్రితమే కొత్తగా వచ్చానని, వెంటనే ఎలుకల ప్యాడ్‌లను పెట్టిస్తానని తెలిపారు.

- చిత్రాలు: ఈనాడు సంగారెడ్డి


జిల్లా వార్తలు
మరిన్ని

ఈటీవీ స్పెషల్

దేవతార్చన