Latest Telugu News, Headlines, Breaking News, Articles
close

తాజా వార్తలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ట్విట్టర్‌ పోస్టుకు స్పందించి రూ.లక్ష మంజూరు

పృథ్వీరాజ్‌ చౌహన్‌

జనగామ రూరల్‌, న్యూస్‌టుడే: నాలుగు నెలల వయసున్న బాలుడి గుండె ఆపరేషన్‌కు తెరాస రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ సీఎం రీలిప్‌ ఫండ్‌ ద్వారా రూ.లక్ష అందించి తన సేవా థృక్పథాన్ని చాటుకున్నారు. జనగామ మండలంలోని గానుగుపహాడ్‌ శివారు కొర్రతండాకు చెందిన కొర్ర శంకర్‌ కుమారుడు పృథ్వీరాజ్‌ చౌహన్‌కు గుండెకు రంధ్రం ఉందని, ఆపరేషన్‌ అవసరమని వైద్యులు నిర్ధరించారు. తన కొడుకు వైద్య ఖర్చుల కోసం సాయం అందించాలని శంకర్‌ కేటీఆర్‌కు ట్విట్టర్‌ పోస్టు చేశారు. రెండు రోజుల వ్యవధిలో స్పందించిన కేటీఆర్‌ సీఎంఆర్‌ఎఫ్‌ నుంచి రూ. లక్ష ఎల్‌వోసీని మంజూరు చేయించారు. బాలుడి ఆపరేషన్‌ విజయవంతం కావడంతో కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేస్తూ కేటీఆర్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

కేటీఆర్‌కు పంపిన ట్విట్టర్‌, స్పందించిన సందేశం


జిల్లా వార్తలు
మరిన్ని

ఈటీవీ స్పెషల్

దేవతార్చన