Latest Telugu News, Headlines, Breaking News, Articles
close

తాజా వార్తలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

నలుగురికి గాయాలు

సారంగాపూర్‌: ప్రమాదవశాత్తు వ్యవసాయ బావిలోకి ఓ కారు దూసుకెళ్లిన ఘటన జగిత్యాల జిల్లా సారంగాపూర్‌ మండలంలోని నాయకపుగూడెం సమీపంలో శుక్రవారం జరిగింది. సిరిసిల్ల జిల్లాకు చెందిన వైద్యులు కడెం ప్రాజెక్టు సందర్శించి తిరిగి వెళ్తుండగా మార్గంమధ్యలో ఈ ప్రమాదం జరిగింది. కారులో శ్యామ్‌, సంతోష్‌, రాజేందర్‌, విజయ్‌ ఉన్నారు. ఈ ప్రమాదంలో సంతోష్, రాజేందర్‌లకు తీవ్రగాయాలవగా మిగిలిన ఇద్దరు స్వల్పంగా గాయపడ్డారు. దీనిపై సమాచారం అందుకున్న స్థానిక ఎస్సై రాజయ్య, తహసీల్దార్‌ నవీన్‌లు గ్రామస్థుల సహకారంతో గాయపడిన వారిని బయటకు తీసి ఆస్పత్రికి తరలించారు. వీరిలో విజయ్‌ సిరిసిల్ల ఏరియా ఆసుపత్రిలో ఆర్‌ఎంవోగా పనిచేస్తున్నారు.


జిల్లా వార్తలు
మరిన్ని

ఈటీవీ స్పెషల్

దేవతార్చన