Latest Telugu News, Headlines, Breaking News, Articles
close

తాజా వార్తలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

చంచల్‌గూడ (హైదరాబాద్‌): మోజో టీవీ ఛానెల్‌ మాజీ సీఈవో రేవతి శుక్రవారం చంచల్‌గూడ జైలు నుంచి బెయిల్‌పై  విడుదలయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. తనను అరెస్టు చేసేందుకు రాత్రి సమయంలో మూడు పోలీస్‌స్టేషన్ల సిబ్బందిని పంపి దాడి చేయించి తీసుకెళ్లడం ఎంతవరకు న్యాయమన్నారు. ఈ విషయంలో పోరాటం ఆగదన్నారు. 

శబరిమలై అయ్యప్ప ఆలయంలోకి మహిళల ప్రవేశంపై జనవరి 24న మోజో టీవీ చర్చకు జాతీయ ఎస్సీ పరిరక్షణ సమితి ఉపాధ్యక్షుడు నాగులరపు వరప్రసాద్ హాజరయ్యారు. చర్చ లో యాంకర్ రఘుతో వాగ్వాదం జరగ్గా.. వరప్రసాద్‌ను పంపించివేశారు. దళితుడైన తనను అవమానించారని ఆయన బంజారాహిల్స్ ఠాణా లో ఫిర్యాదుచేశారు. రఘు, రేవతిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి అరెస్ట్‌ చేశారు.


జిల్లా వార్తలు
మరిన్ని

ఈటీవీ స్పెషల్

దేవతార్చన