Latest Telugu News, Headlines, Breaking News, Articles
close

తాజా వార్తలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

రాజాపూర్‌, న్యూస్‌టుడే : రాజాపూర్‌ మండలంలో ప్రమాదాలు నిత్యకృత్యంగా మారాయి. మండలం మీదుగా వెళ్లే జాతీయ రహదారిపైకి ఎక్కాలంటేనే ప్రజలు భయపడే పరిస్థితి నెలకొంది. ఆదివారం మధ్యాహ్నం రోడ్డు పక్కన కూర్చున్న పశువుల కాపరుల పైకి ఓ కారు ఎక్కి ఈడ్చుకెళ్లటంతో ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు వదిలారు. జడ్చర్ల రూరల్‌ సీఐ శివకుమార్‌ కథనం ప్రకారం.. రాజాపూర్‌ మండలం కుచ్చర్‌కల్‌ గ్రామానికి చెందిన రంగయ్య, యాదగిరి, గొడుగు చంద్రయ్యలు పశువులను మేపుతూ రోడ్డు పక్కన కూర్చున్నారు. అదే సమయంలో తిర్మలాపూర్‌ నుంచి రాజాపూర్‌ వైపు వస్తున్న ఇన్నోవా కారు అదుపుతప్పి వారిపైకి దూసుకెళ్లింది. ముగ్గురిని చాలాదూరం ఈడ్చుకెళ్లటంతో ప్రాణాలు వదిలారు. కారు డ్రైవర్‌ మద్యం తాగి ఉన్నాడని స్థానికులు తెలిపారు. అతివేగంగా, అజాగ్రత్తగా నడపటం వల్లనే కారు రోడ్డు దిగి పక్కన కూర్చున్న వారిపైకి దూసుకెళ్లిందని చెప్పారు. మృతుల కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. మృతిచెందిన వారి ఒక్కో కుటుంబానికి రూ. 20 లక్షల చొప్పున పరిహారం చెల్లించాలని బంధువులు, గ్రామస్థులు రహదారిపై ధర్నాకు దిగారు. సీఐ శివకుమార్‌, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రమాదానికి కారణమైన కారును, డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. పోలీసులు నచ్చజెప్పేందుకు ప్రయత్నించినా గ్రామస్థులు ఆందోళన కొనసాగించారు.

ప్రమాదానికి కారణమైన కారు


జిల్లా వార్తలు
మరిన్ని

ఈటీవీ స్పెషల్

దేవతార్చన