Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 146596
            [news_title_telugu_html] => గొడ్డలితో దాడి: ఇద్దరికి గాయాలు
            [news_title_telugu] => గొడ్డలితో దాడి: ఇద్దరికి గాయాలు
            [news_title_english] => 
            [news_short_description] => అన్నదమ్ముల మధ్య పాత కక్షలు, ఇంటిస్థలం వివాదంపై జరిగిన గొడవ గొడ్డలి దాడికి దారితీసిన ఘటన గురువారం కుభీరులో చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కుభీరుకు చెందిన పుప్పాల ఊషన్న, ...

            [news_tags_keywords] => 
            [news_bulletpoints] => 
            [news_bulletpoints_html] => 
            [news_videotype] => 0
            [news_videolink] => 
            [news_videoinfo] => | |
            [publish_comments_public] => 
            [publish_createdon] => 2019-08-23 05:12:33
            [news_isactive] => 1
            [news_status] => 2
        )

)
గొడ్డలితో దాడి: ఇద్దరికి గాయాలు - EENADU
close

తాజా వార్తలు

గొడ్డలితో దాడి: ఇద్దరికి గాయాలు

అన్నదమ్ముల కుటుంబాల మధ్య ఘర్షణ

గొడ్డలిదాడిలో సునీత వీపుపై అయిన గాయం

కుభీరు, న్యూస్‌టుడే: అన్నదమ్ముల మధ్య పాత కక్షలు, ఇంటిస్థలం వివాదంపై జరిగిన గొడవ గొడ్డలి దాడికి దారితీసిన ఘటన గురువారం కుభీరులో చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కుభీరుకు చెందిన పుప్పాల ఊషన్న, పుప్పాల రాములు అన్నదమ్ములు. ఇరు కుటుంబాలు వేర్వేరుగా జీవిస్తున్నాయి. పెద్దవాడైన ఊశన్న నూతనంగా ఇంటి నిర్మాణం చేపడుతున్నాడు. ఊశన్న ఇంటి పైకప్పు నుంచి వస్తున్న వర్షపు నీరు రాములు ఇంటి వద్ద పడి గుంతలవుతున్న విషయమై వారం రోజుల క్రితమే రెండు కుటుంబాల మధ్య గొడవ జరిగింది. గ్రామపెద్దలు, పోలీసులు ఇరువురికి సర్ది చెప్పారు. తాజాగా గురువారం ఊషన్న భార్య సునీత, కొడుకు రాహుల్‌ ఇంటి గోడలకు రంగులు వేస్తున్న సమయంలో వర్షపునీటి గుంతలు పూడ్చాలంటూ రాములు గొడవపడ్డాడు. వారి మధ్య మాటమాట పెరిగింది. తల్లీ కొడుకు కలసి కొడుతున్నారని ఆగ్రహించిన రాములు ఇద్దరిపై గొడ్డలితో దాడి చేశాడు. ఈ ఘటనలో సునీత వీపు, చేతికి, రాహుల్‌కు చేతికి, ఇతరచోట్ల గాయాలయ్యాయి. వెంటనే నిందితుడు పోలీసుస్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. క్షతగాత్రులను కుటుంబీకులు, స్థానికులు కలసి భైంసా ఏరియా ఆసుపత్రికి తరలించి ప్రథమ చికిత్స చేయించారు. మెరుగైన వైద్యం కోసం నిజామాబాద్‌ ఆసుపత్రికి తరలించాలని వైద్యులు సూచించారు. ఊషన్న ఇచ్చిన ఫిర్యాదు మేరకు రాములుపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ప్రేమ్‌దీప్‌ తెలిపారు.

గాయపడిన సునీత


జిల్లా వార్తలు

ఈటీవీ స్పెషల్

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.