Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 146613
            [news_title_telugu_html] => 

స్నేహితుడిపై యువకుల దాడి

[news_title_telugu] => స్నేహితుడిపై యువకుల దాడి [news_title_english] => [news_short_description] => కొందరు యువకులు తోటి స్నేహితున్ని తీవ్రంగా చితకబాది మృతి చెందాడనుకొని కొండగట్టు ప్రాంతంలో వదిలివెళ్లిన సంఘటన కలకలం రేపింది. [news_tags_keywords] => [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => KX7FvAZWZoY [publish_comments_public] => [publish_createdon] => 2019-08-23 05:56:54 [news_isactive] => 1 [news_status] => 2 ) )
స్నేహితుడిపై యువకుల దాడి - EENADU
close

తాజా వార్తలు

స్నేహితుడిపై యువకుల దాడి

మల్యాల, న్యూస్‌టుడే: కొందరు యువకులు తోటి స్నేహితున్ని తీవ్రంగా చితకబాది మృతి చెందాడనుకొని కొండగట్టు ప్రాంతంలో వదిలివెళ్లిన సంఘటన కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మల్యాల మండలం ముత్యంపేటకు చెందిన లంక వంశీ(24) తన స్నేహితులతో కల్సి బుధవారం సాయంత్రం కొండగట్టు ప్రాంతంలోని మారుతిటౌన్‌షిప్‌ ముందుగల రైల్వేలైను సమీపంలో విందు చేసుకొన్నారు. మద్యం సేవించిన తర్వాత పలువురు యువకులు లంక వంశీపై దాడిచేసి కాళ్లు విరగ్గొట్టి, తల పగలగొట్టారు. మర్మాంగాలపైనా దాడి చేశారు. వంశీ అపస్మారక స్థితికి చేరుకోవడంతో మృతి చెందాడనుకుని అతని వద్ద గల చరవాణిలోని సిమ్‌ను కూడా తొలగించి మాయం చేశారు. తర్వాత వంశీని అక్కడే వదిలి వెళ్లిపోయారు. గురువారం ఉదయం ఓ వ్యక్తి బోడకాకర కాయల కోసం ఆ ప్రాంతంలో వెతుకుతుండగా తీవ్ర గాయాలతో కదలలేని స్థితిలో ఉన్న వంశీ కనిపించడంతో స్థానికులకు తెలియజేశాడు. వెంటనే 108కు, పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. వంశీని జగిత్యాల ఆసుపత్రికి తరలించగా పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం కరీంనగర్‌కు తరలించారు. బాధితుడు ఆసుపత్రిలో కోలుకొంటున్నాడని, కాళ్లు విరిగి, తలకు తీవ్ర గాయమైందని ఎస్సై ఉపేంద్రచారి తెలిపారు. దాడిలో ముగ్గురు యువకుల ప్రమేయం ఉన్నట్లు భావిస్తున్నామన్నారు.  ప్రేమ వ్యవహారమే దాడికి దారి తీసి ఉండవచ్చన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. కేసు నమోదు చేసినట్లు ఎస్సై పేర్కొన్నారు.



జిల్లా వార్తలు

ఈటీవీ స్పెషల్

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.