close

తాజా వార్తలు

ఆశ్రమ పాఠశాల అక్రమాలపై విచారణ జరిపించాలి

ఏసీసీ, న్యూస్‌టుడే: జిల్లాలోని ఓ ఆశ్రమ పాఠశాలలో జరిగిన అవినీతి అక్రమాలపై విచారణ జరిపించాలని వామపక్ష విద్యార్థి సంఘాల నాయకులు తోటరాజేష్‌ పేర్కొన్నారు. ఈ విషయమై సోమవారం ఏటీడబ్ల్యూవో నారాయణకు వినతిపత్రం అందజేశారు. సదరు పాఠశాలలో ఓ ఉపాధ్యాయుడి జైలు జీవితం గడిపి నెల రోజుల జీతం తీసుకున్నా ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. సంవత్సరం గడుస్తున్నా ఆయనపై చర్యలు తీసుకోవడంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్‌ జిల్లా కార్యదర్శి సన్నీగౌడ్‌, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి బొంకూరి గోవర్దన్‌, పీడీఎస్‌ జిల్లా ఉపాధ్యక్షుడు ఎండీ గఫూర్‌ తదితరులు పాల్గొన్నారు.


జిల్లా వార్తలు

ఈటీవీ స్పెషల్

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.