close

తాజా వార్తలు

ఎండబెట్టినవన్నీ ప్రశ్నాపత్రాలే..!

ఈ చిత్రంలో ఎండలో ఆరబెడుతున్నవి కాగితాలు అనుకుంటున్నారా...ఈ నెల 25 నుంచి నిర్వహించనున్న సంగ్రహనాత్మక-1 పరీక్షల ప్రశ్నాపత్రాలు...ఇవన్ని మంథని మండలంలోని ప్రాథమిక పాఠశాలలకు సంబంధించినవి...రెండు రోజుల క్రితం కురిసిన వర్షానికి మండల విద్యావనరుల కేంద్రంలో తడిసిపోయాయి. ఈ నెల 25 నుంచి పరీక్షలు జరగనుండగా ప్రశ్నాపత్రాలు తడిసిన విషయాన్ని సీˆఆర్పీలు మంగళవారం గుర్తించారు. 6-10 తరగతి వరకు ప్రశ్నాపత్రాలు భద్రంగానే ఉండగా 1-5 తరగతులవి మాత్రం తడిశాయి. వెంటనే విద్యావనరుల కేంద్రం ఆవరణలో ఎండబెట్టారు. మండలంలో 48 ప్రాథమిక పాఠశాలలున్నాయి. వీటిల్లో 1247 మంది ఉన్నారు. సంగ్రహనాత్మక-1 పరీక్షలకు సంబంధించి వేల సంఖ్యలో ప్రశ్నాపత్రాలు తడిసిపోయాయి. వర్షం కురిసినప్పుడల్లా విద్యావనరుల కేంద్రంలో నీరు చేరుతోంది. గతంలో పుస్తకాలు పెద్దఎత్తున తడిసిన సందర్భాలున్నాయి. కార్యాలయంలో ఉన్న తమ సేవా పుస్తకాలు పదిలమేనా..? అంటూ కొందరు ఉపాధ్యాయులు ఆందోళన వ్యక్తంచేయడం గమనార్హం. ఓ వైపు శిథిలమైన భవనానికి తోడు వర్షపు నీరు చేరడంతో ఇక్కడ దస్త్రాలకు రక్షణ లేదన్న అభిప్రాయాలను ఉపాధ్యాయులు వెలుబుచ్చారు. - న్యూస్‌టుడే, మంథని


జిల్లా వార్తలు

ఈటీవీ స్పెషల్

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.