
తాజా వార్తలు
మూఢ నమ్మకాలకు విద్యార్థి బలి
చెంగోల్లో విషాదకర ఘటన
చెంగోల్, తాండూరుగ్రామీణ, న్యూస్టుడే: పాము కాటువేస్తే ఆ వ్యక్తిని వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లాలి. లేదా వైద్యుడికి ఫోన్ చేసి తక్షణ నివారణ చర్యలు తీసుకోవాలి. ఇలాంటిదేమీ చేయకుండా తమకు తోచిన విధంగా ఎక్కడో దూరాన ఉన్న మంత్రగాడిని ఆశ్రయిస్తే...ఏమవుతుంది...పరిస్థితి చేయిదాటి మృత్యువు దరిచేరుతుంది. వికారాబాద్ జిల్లా, తాండూరు మండలం, చెంగోల్ గ్రామంలో సరిగ్గా ఇదే జరిగింది.ఈ గ్రామానికి చెందిన సురేష్, విజయలక్ష్మి దంపతుల కుమారుడు సాయిచంద్ (15) గ్రామంలోని జడ్పీ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి చదువుతున్నాడు. మంగళవారం రాత్రి ఇంటి పరిసరాల్లో మూత్ర విసర్జన చేస్తుండగా పాము కాటు వేసింది. వెంటనే గమనించిన విద్యార్థి విషయాన్ని తండ్రికి వివరించాడు. అప్పటికప్పుడు కాలుకు తాడుతో గట్టిగా కట్టి ఆటోలో తాండూరు మీదుగా పది కిలో మీటర్లకుపైగా దూరానున్న పెద్దేముల్ మండలం గొట్లపల్లికి తీసుకెళ్లారు. అక్కడ మంత్రగాడిని ఆశ్రయించగా కాలుకు కట్టిన తాడును విప్పించారు. దీంతో ఒక్కసారిగా విషం శరీరానికి పాకడంతో విద్యార్థి అపస్మారకస్థితిలోకి వెళ్లాడు. పరిస్థితి విషమంగా మారడంతో మంత్రగాడు చేతులెత్తేసి ఆస్పత్రికి తీసుకెళ్లాల్సిందిగా సూచించాడు. దీంతో అదే ఆటోలో తాండూరులోని జిల్లా ఆస్పత్రికి తరలించారు. పరిశీలించిన వైద్యులు అప్పటికే విద్యార్థి మృతి చెందినట్లు ధ్రువీకరించారు. అనంతరం మృతదేహాన్ని ఇంటికి తరలించారు. సంఘటన జరిగిన వెంటనే తల్లిదండ్రులు జిల్లా ఆస్పత్రికి తీసుకెళ్లి ఉంటే విద్యార్థి బతికే వాడని గ్రామస్థులు, ఉపాధ్యాయులు అభిప్రాయపడ్డారు.
- దిశ హత్య కేసు నిందితుల ఎన్కౌంటర్
- దిశ ఆధారాలపై ‘సూపర్ లైట్’
- జీవచ్ఛవాన్నీ కాల్చేశారు..!
- పెళ్లి వారమండీ.. జైలుకు పదండి..!
- మహిళకు పాము కాటు.. డోలీ కట్టి 8.కి.మీ...
- శబరిమల తీర్పుపై సుప్రీం కీలక వ్యాఖ్యలు
- ‘ఆ విషయంలో రాముడూ గ్యారెంటీ ఇవ్వలేడు’
- కేంద్రానిది తొందరపాటు నిర్ణయం:మాయావతి
- ఒక్కరికే ఛాన్స్: కోహ్లీ
- కొల్లగొట్టింది రూ.100కోట్లకు పైనే!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
