
తాజా వార్తలు
ముందుగానే నిలిపేసిన డయాలసిస్
అత్యవసర చికిత్సలకు ఆటంకం
ఐసీయూలో వృద్ధునికి టవల్‌తో గాలి విసురుతున్న మహిళ
గద్వాల పట్టణం, న్యూస్‌టుడే : జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో అత్యవసర చికిత్సలు నిలిచిపోయాయి. బుధవారం మధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం 5.50 గంటల వరకు విద్యుత్తు సరఫరా నిలిచిపోవడంతో రోగులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. గంటపాటు జనరేటర్‌తో డయాలసిస్ చేసిన సిబ్బంది డీజిల్ అయిపోవడంతో నిలిపివేశారు. అనంతరం విద్యుత్తు సరఫరా నిలిచిపోయిన విషయాన్ని చికిత్స కోసం వచ్చే బాధితులకు చరవాణి ద్వారా తెలిపారు. విషయం తెలియనివారు సుదూర ప్రాంతాల నుంచి వచ్చి ఉదయం నుంచి సాయంత్రం వరకు వేచి ఉండాల్సి వచ్చింది. ముఖ్యంగా అత్యవసర చికిత్స అందించే ఐసీయూ చీకటమయంగా మారింది. ఉక్కపోతతో ఇబ్బందులు పడిన రోగులకు తమ బంధువులు టవళ్లను ఊపి ఉపశమనం కలిగించారు. ఎవరూ అత్యవసర చికిత్స కోసం ఆసుపత్రికి రాకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పిందని వైద్య సిబ్బంది పేర్కొన్నారు. ఈ విషయమై విద్యుత్తు శాఖ ఎస్ఈ చక్రపాణిని ‘న్యూస్‌టుడే’ సంప్రదించగా జిల్లాలోని నాలుగు మండలాలకు సరఫరా చేసే 132/కేవీ ఉపకేంద్రంలో తలెత్తిన సాంకేతిక సమస్య వల్ల ఇబ్బందులు ఏర్పడ్డాయన్నారు.
- మాకొద్దీ ఉద్యోగం!
- ఆయనే లోకమన్నది.. అంతలోనే అంతమైంది
- నిత్యానందా.. నీ దేశానికి వీసా ఎలా?
- నోట్లో దుస్తులు కుక్కి వివాహితపై అత్యాచారం
- విండీస్ వీరులారా.. ఓ విన్నపం!
- ఎందుకా పైశాచికం?
- కదులుతున్న కారులోనే లైంగిక దాడి
- ఆ పాట నా ఇమేజ్ను పూర్తిగా మార్చేసింది!
- ‘బుమ్రా నా ముందొక బేబీ బౌలర్’
- పార్లమెంట్‌కు చిదంబరం..
ఎక్కువ మంది చదివినవి (Most Read)
