
తాజా వార్తలు
సదాశివపేట: మద్యం మత్తులో ఓ తమ్ముడు తన అన్ననే అంతమొందించాడు. రోకలిబండతో అతి కిరాతకంగా హత్య చేశాడు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం ఆత్మకూరులో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. బుధవారం రాత్రి బంధువుల నిశ్చితార్థం సందర్భంగా అన్నదమ్ములు అమరేందర్(35), చిట్టిబాబు ఇద్దరూ విందులో పాల్గొని మద్యం సేవించారు. ఈ క్రమంలో వారిద్దరి మధ్య మాటామాటా పెరిగి ఘర్షణ చోటుచేసుకుంది. దీంతో అక్కడున్న వారు కలగజేసుకుని ఇద్దరికీ నచ్చజెప్పి పంపివేశారు. బుధవారం రాత్రి తమ్ముడు చిట్టిబాబు తన అన్న ఇంటికెళ్లి నిద్రిస్తున్న అమరేందర్(35)ను రోకలిబండతో బలంగా కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.
జిల్లా వార్తలు
- అస్థీకరణ పరీక్షే ప్రామాణికం!
- న్యూజెర్సీలో కాల్పులు..ఆరుగురి మృతి
- ఏపీ సచివాలయం వద్ద డ్రోన్ కలకలం..
- బస్సులో వెళ్తున్న యువతికి తాళి కట్టిన యువకుడు
- 8 మంది.. 8 గంటలు
- నాకు బైక్.. జడ్జికి రూ. 15 లక్షలు
- నాడు గొంతు కోశాడు నేడు ప్రాణం తీసుకున్నాడు
- ఖాకీల నిర్లక్ష్యం.. ఈ శవమే సాక్ష్యం!
- ఆనమ్ మీర్జా మెహందీ వేడుకలో సానియా తళుకులు
- సినిమా పేరు మార్చాం
ఎక్కువ మంది చదివినవి (Most Read)
