close

తాజా వార్తలు

వేములవాడ ఆలయంలో కానుకల చోరీ

వేములవాడ: వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామివారి ఆలయంలో గత నెల నిర్వహించిన హుండీ లెక్కింపుల సమయంలో లెక్కింపు ప్రక్రియలో పాల్గొన్న ఓ వ్యక్తి వెండి, బంగారు కానుకలను దొంగిలించినట్లు ఆలయ అధికారులు గుర్తించారు. దొంగతనం కేసులో కరీంనగర్‌ జిల్లా పోలీసులు ఓ వ్యక్తిని అరెస్టు చేయగా అనుకోని విధంగా ఆలయంలో జరిగిన చోరీ గురించి బయటపడింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామివారి ఆలయంలో గత నెల 23న హుండీ కానుకలను లెక్కించారు. లెక్కింపులో పాల్గొన్న ఓ గుర్తు తెలియని వ్యక్తి భక్తులు సమర్పించిన వెండి, బంగారు కానుకలను దొంగిలించి ఆలయంలోని ఓ రహస్య ప్రదేశంలో దాచి ఉంచాడు. ఆ సమయంలో దొంగతనం జరిగినట్లు ఆలయ అధికారులు గుర్తించకపోవడం గమనార్హం. మరోవైపు ఆలయాల్లో చిల్లర దొంగతనాలు చేసే ఫిరోజ్‌ అనే వ్యక్తిని ఓ కేసు విషయంలో కరీంనగర్ జిల్లా సీసీఎస్‌ పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టు అనంతరం ఫిరోజ్‌ ఇంట్లో తనిఖీ చేస్తుండగా పోలీసులు ఓ మూటను గుర్తించారు. అందులో వెండి, బంగారు ఆభరణాలు ఉన్నట్లు గుర్తించిన పోలీసులు ఫిరోజ్‌ను వీటి గురించి విచారించారు. ఈ బంగారు అభరణాల మూటను వేములవాడ ఆలయంలో దొంగిలించినట్లు ఫిరోజ్‌ పోలీసులకు వెల్లడించాడు. కరీంనగర్‌ సీసీఎస్‌ పోలీసుల ద్వారా వివరాలు తెలుసుకున్న వేములవాడ పోలీసులు ఈ కేసుకు సంబంధించి దర్యాప్తు చేపట్టారు. దీనిలో భాగంగా హుండీ లెక్కింపు జరిగిన రోజు సీసీ టీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నట్లు వేములవాడ సీఐ వెంకటస్వామి తెలిపారు.


జిల్లా వార్తలు

ఈటీవీ స్పెషల్

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.