close

తాజా వార్తలు

విమానాశ్రయంలో శాటిలైట్‌ ఫోన్‌ స్వాధీనం

శంషాబాద్‌ గ్రామీణ: మన దేశంలో నిషేధించిన శాటిలైట్‌ ఫోన్‌ విమానాశ్రయంలో పట్టుబడింది. శంషాబాద్‌ విమానాశ్రయ పోలీసుల వివరాల ప్రకారం.. అమెరికాకు చెందిన రాబర్ట్‌ స్కాట్‌(50) యాపిల్‌ సంస్థలో సేఫ్టీ మేనేజర్‌గా పని చేస్తున్నాడు. అదే సంస్థకు చెందిన శాటిలైట్‌ ఫోన్‌ తీసుకుని ఇండియాకు వచ్చాడు. ఈ నెల 5న సింగపూర్‌ వెళ్లడానికి శంషాబాద్‌ విమానాశ్రయానికి చేరుకున్నాడు. ఇక్కడి భద్రతాధికారుల అతని సామగ్రిని తనిఖీ చేయగా ఆ శాటిలైట్‌ ఫోన్‌ బయటపడింది. పోలీసులు దాన్ని స్వాధీనం చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.


జిల్లా వార్తలు

ఈటీవీ స్పెషల్

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.