టీ కప్పులో ఫ్లెమింగో!

గులాబీరంగులో ఉండే ఫ్లెమింగోలు చూడచక్కగా భలే ఉంటాయి కదా... అడవులు లేదా జూల్లో అరుదుగా కనిపించే వీటిని మీ ఇంట్లోనే...

Updated : 18 Oct 2020 04:09 IST


గులాబీరంగులో ఉండే ఫ్లెమింగోలు చూడచక్కగా భలే ఉంటాయి కదా... అడవులు లేదా జూల్లో అరుదుగా కనిపించే వీటిని మీ ఇంట్లోనే బంధించాలనుకుంటున్నారా. అయితే ఇంకెందుకాలస్యం ఓ అందమైన గులాబీ ఫ్లెమింగోను తీసుకొచ్చి మీ కప్పులో వదిలేయండి. ఫ్లెమింగోను కప్పులో వదలడం ఏంటని ఆశ్చర్యపోతున్నారు కదూ... ఎందుకంటే ఇది ‘ఫ్లెమింగో ఫ్లోట్‌ టీ ఇన్‌ఫ్యూజర్‌’. కప్పు వేడినీళ్లలో దీన్ని పెడితే తేనీరు సిద్ధమవుతుంది. ఈ బొమ్మ అడుగు భాగంలో టీపొడి పెట్టుకోవడానికి వీలైన అమరిక ఉంటుంది. దాంట్లో పొడిని నింపి బొమ్మకు బిగించడమే. ఇది నీటి మీద అలా తేలుతుంటే ఇలా టీ తయారవుతుంది. భలే ఉంది కదా...


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని