పండ్ల కుల్ఫీలివిగో...

ఎండలు ఎక్కువగా ఉన్నప్పుడు... ఓ కుల్ఫీ తింటే ఎంత బాగుంటుందో... తియ్యగా, చల్లగా ... తింటుంటే ఎంతో హాయిగా ఉండే కుల్ఫీల్లో బోల్డన్ని రకాలూ ఉన్నాయి. కేసర్‌పిస్తా, సేమ్యా, మ్యాంగో, మట్కామలై కుల్ఫీలాంటి రుచులెన్నో వీటిల్లో ఉన్నాయి.

Updated : 15 Jun 2021 12:47 IST

పొరుగు రుచి

ఎండలు ఎక్కువగా ఉన్నప్పుడు... ఓ కుల్ఫీ తింటే ఎంత బాగుంటుందో... తియ్యగా, చల్లగా ... తింటుంటే ఎంతో హాయిగా ఉండే కుల్ఫీల్లో బోల్డన్ని రకాలూ ఉన్నాయి. కేసర్‌పిస్తా, సేమ్యా, మ్యాంగో, మట్కామలై కుల్ఫీలాంటి రుచులెన్నో వీటిల్లో ఉన్నాయి. సాధారణంగా పుల్లకు గుచ్చిన కుల్ఫీలే మనకు అందుబాటులో ఉంటాయి. దిల్లీలో మాత్రం కుల్ఫీలు పండ్ల ఆకారంలోనూ దొరుకుతాయి. రంగురంగుల పండ్లలా ఉండే ఇవి చూడ్డానికి ఏదో స్వీటులా కనిపిస్తాయి. మామిడి, కమలాపండు ఆకారాల్లోని కుల్ఫీలను చూస్తే నిజంగా పండ్లలాగానే కనిపిస్తాయి. మామిడిపండును ముక్కలు కోసుకుని తిన్నట్టుగా వీటిని తినేయొచ్చు. అందుకే వీటిని ఎంతో ఇష్టంగా ఆరగిస్తారట దిల్లీవాసులు. ఈ పండ్ల కుల్ఫీ ముక్కలను చూస్తుంటే మీకూ నోరూరుతోంది కదూ...



 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని