బంగారు బొప్పాయి!

పసిడి వర్ణంతో మెరిసిపోయే ఈ పండు ఎన్నో పోషకాలను అందిస్తుంది. అలసటను తగ్గించడం దగ్గరి నుంచి రోగనిరోధకతను పెంచడం వరకూ ఈ పండు ప్రత్యేకతలు ఎన్నో.బొప్పాయిలో విటమిన్‌-ఎ, బి, సి, ఇ, కెలతోపాటు

Updated : 09 May 2021 04:52 IST

పోషకాలమ్‌

పసిడి వర్ణంతో మెరిసిపోయే ఈ పండు ఎన్నో పోషకాలను అందిస్తుంది. అలసటను తగ్గించడం దగ్గరి నుంచి రోగనిరోధకతను పెంచడం వరకూ ఈ పండు ప్రత్యేకతలు ఎన్నో.
* బొప్పాయిలో విటమిన్‌-ఎ, బి, సి, ఇ, కెలతోపాటు క్యాల్షియం, మెగ్నీషియం, జింక్‌, ఫోలేట్‌ మూలకాలుంటాయి.
* దీనిలోని విటమిన్‌-సి దంతాలు, చిగుళ్ల సమస్యలను తగ్గించడంతోపాటు రోగనిరోధకతను పెంచడానికి సాయపడుతుంది. దీన్ని తరచూ తీసుకుంటే రకరకాల జబ్బుల బారిన పడకుండా ఉంటాం.
* ఈ పండులోని పొటాషియం, యాంటీఆక్సిడెంట్లు, పీచు గుండె ఆరోగ్యాన్ని కాపాడతాయి. అధిక రక్తపోటును నియంత్రిస్తాయి.
* బొప్పాయిలో నీటి శాతం ఎక్కువగానే ఉంటుంది. కాబట్టి ఇది త్వరగా జీర్ణమవడమే కాకుండా కడుపు ఉబ్బరం, మలబద్ధకం లాంటి సమస్యలను తగ్గిస్తుంది.
* ఈ ఫలం నుంచి అందే కెలొరీలు చాలా తక్కువ. బరువు తగ్గాలనుకునేవారికి ఈ పండు చక్కటి ఎంపిక. దీన్ని తరచూ తీసుకుంటే ఎముకలు దృఢంగా మారతాయి.
* బొప్పాయి పండును ఆహారంలో చేర్చుకుంటే ఉదర సంబంధ సమస్యలు తగ్గుముఖం పడతాయి.
* ఎక్కువ మొత్తంలో విటమిన్‌-ఎ లభించే పండు బొప్పాయే. దీంట్లోని బీటా కెరొటిన్‌ కంటి సమస్యలు రాకుండా కాపాడుతుంది.
* బొప్పాయి గుజ్జును ముఖానికి పూతలా వేసుకుని అరగంట తర్వాత కడిగేస్తే మోము మెరుస్తుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని