అచ్చంగా జార్‌లానే!

పప్పు, ఉప్పు, చక్కెర... ఇలా కేజీ, అరకేజీ ప్యాకెట్లలో వచ్చేవాటిని అస్తమాను జార్‌లో పోయడానికి ఇబ్బంది పడుతున్నారా... అయితే సరకుల ప్యాకెట్లనే డబ్బాలుగా మార్చుకోవచ్చు. ఎలా అంటారా... అది ‘బ్యాగ్‌ క్లోజర్‌’ అనే గ్యాడ్జెట్‌ ద్వారా సాధ్యమవుతుంది. 

Updated : 25 Jul 2021 01:57 IST

వంటింటి నేస్తం

ప్పు, ఉప్పు, చక్కెర... ఇలా కేజీ, అరకేజీ ప్యాకెట్లలో వచ్చేవాటిని అస్తమాను జార్‌లో పోయడానికి ఇబ్బంది పడుతున్నారా... అయితే సరకుల ప్యాకెట్లనే డబ్బాలుగా మార్చుకోవచ్చు. ఎలా అంటారా... అది ‘బ్యాగ్‌ క్లోజర్‌’ అనే గ్యాడ్జెట్‌ ద్వారా సాధ్యమవుతుంది. 

ముందుగా పప్పు/ఉప్పు ఉన్న కవరు పైభాగాన్ని కత్తిరించి దానికి రింగు లాంటి పరికరాన్ని తొడగాలి. ఆ తర్వాత కవరును కిందికి లాగి మూత పెట్టేయాలి. ఇప్పుడు ఇదొక సీసాలా మారిపోతుంది. చిన్నా, పెద్దా కవర్లను సీసాలు/డబ్బాల్లా మార్చుకోవచ్చు. ఇలా చేయడం వల్ల అందులోని పదార్థం పాడవదు, వృథానూ అరికట్టవచ్చు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని