హనీ చిల్లీ పొటాటో ఫ్రై!

కావాల్సినవి: తేనె, నువ్వులు- రెండు పెద్ద చెంచాల చొప్పున, బంగాళాదుంపలు- నాలుగు, కార్న్‌ఫ్లోర్‌- మూడు పెద్ద చెంచాలు, నూనె- వేయించడానికి సరిపడా,

Updated : 15 Aug 2021 05:22 IST

కావాల్సినవి: తేనె, నువ్వులు- రెండు పెద్ద చెంచాల చొప్పున, బంగాళాదుంపలు- నాలుగు, కార్న్‌ఫ్లోర్‌- మూడు పెద్ద చెంచాలు, నూనె- వేయించడానికి సరిపడా, వెల్లుల్లి రెబ్బలు- నాలుగైదు, పచ్చిమిర్చి- నాలుగు, ఉల్లిపాయ- ఒకటి, క్యాప్సికం ముక్కలు- పావు కప్పు, ఉప్పు- తగినంత, సోయాసాస్‌, రెడ్‌ చిల్లీసాస్‌, టొమాటో కెచప్‌- పెద్ద చెంచా చొప్పున, మిరియాల పొడి- అర చెంచా, ఉల్లికాడలు- అర కప్పు.

తయారీ: ముందుగా ఆలూను పొడవైన ముక్కలుగా కోసి వేడినీటిలో వేసి తీయాలి. తర్వాత వాటిని కార్న్‌ఫ్లోర్‌, ఉప్పుతో కలిపి... నూనెలో డీప్‌ ఫ్రై చేసుకోవాలి. మరో పాన్‌లో కొద్దిగా నూనె పోసి అది వేడయ్యాక వెల్లుల్లి రెబ్బలు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు వేసి నిమిషం పాటు వేయించాలి. ఆ తర్వాత కార్న్‌ఫ్లోర్‌నీ కలిపి మరో రెండు నిమిషాలపాటు వేయించుకోవాలి. వేయించిన ఆలూ మిశ్రమాన్ని వేసి కలపాలి. సోయాసాస్‌, రెడ్‌చిల్లీసాస్‌, టొమాటో కెచప్‌, సాల్ట్‌ పెప్పర్‌ని వేసి బాగా వేయించాలి. చివరగా తేనె కలిపి, నువ్వులుచల్లి ఉల్లికాడలతో గార్నిష్‌ చేసుకుంటే సరి.

సురేఖా నాగరాజ్‌
జెద్దా, సౌదీ అరేబియా


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని