ఒక్కటే స్లైసర్‌ .. మూడు రకాలుగా!

ఉడికించిన గుడ్డులో బోలెడు పోషకాలుంటాయి. దీన్ని రకరకాల ఆకారాల్లో కోసి, ఉప్పు, కారం, మిరియాల పొడి వేసిస్తే చిన్నారులు ఇష్టంగా తింటారు. అందుకోసం ఉపయోగపడేదే ఈ ‘త్రీ ఇన్‌ వన్‌ ఎగ్‌

Updated : 03 Oct 2021 02:43 IST

ఉడికించిన గుడ్డులో బోలెడు పోషకాలుంటాయి. దీన్ని రకరకాల ఆకారాల్లో కోసి, ఉప్పు, కారం, మిరియాల పొడి వేసిస్తే చిన్నారులు ఇష్టంగా తింటారు. అందుకోసం ఉపయోగపడేదే ఈ ‘త్రీ ఇన్‌ వన్‌ ఎగ్‌ స్లైసర్‌’. గుడ్డును నిలువుగా రెండు ముక్కల్లా; గుండ్రంగా సన్నటి స్లైస్సుల్లా; పొడవుగా ... ఇలా రకరకాలుగా కట్‌ చేసేస్తుంది. పదునైన స్టీలు తీగలు, ప్లాస్టిక్‌తో చేసిన  అంచులతో ఈ పరికరం చూడటానికి చాలా బాగుంటుంది. దీంతో  పుట్టగొడుగులు, స్ట్రాబెర్రీలు, ఉడికించిన ఆలూ... లాంటి కూరగాయలను కూడా ముక్కలుగా కోసేయొచ్చు. శుభ్రం చేయడం కూడా తేలికే. వివిధ రంగుల్లోనూ లభ్యమవుతుంది. మీరూ ప్రయత్నిస్తారా మరి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని