థాయ్‌ గ్రీన్‌ కర్రీ సూప్‌

థాయ్‌లాండ్‌లో చాలా ప్రాచుర్యం పొందిన నూడుల్స్‌ సూప్‌ ఇది. దీన్ని పిల్లలూ, పెద్దలు అందరూ ఇష్టంగా తింటారు. దీన్ని ఎలా తయారుచేయాలో చూద్దామా...

Published : 03 Oct 2021 02:42 IST

థాయ్‌లాండ్‌లో చాలా ప్రాచుర్యం పొందిన నూడుల్స్‌ సూప్‌ ఇది. దీన్ని పిల్లలూ, పెద్దలు అందరూ ఇష్టంగా తింటారు. దీన్ని ఎలా తయారుచేయాలో చూద్దామా...

కావాల్సినవి: రైస్‌ నూడుల్స్‌- 200 గ్రా, వెల్లుల్లి రెబ్బలు- మూడు, థాయ్‌ గ్రీన్‌ కర్రీ పేస్ట్‌- మూడు పెద్ద చెంచాలు, ఉల్లిపాయ- ఒకటి, బోన్‌లెస్‌, స్కిన్‌లెస్‌ చికెన్‌- 100 గ్రా., అల్లం తురుము- పెద్ద చెంచా, చికెన్‌స్టాక్‌- రెండున్నర కప్పులు, ఉల్లికాడల తరుగు- రెండు చెంచాలు, కొబ్బరిపాలు- కప్పు, కొత్తిమీర తరుగు- పావు కప్పు, నిమ్మరసం- రెండు పెద్ద చెంచాలు, మిరియాల పొడి- అర చెంచా, ఉప్పు- తగినంత.

తయారీ: రైస్‌ నూడుల్స్‌ని ఉడికించి చల్లార్చి పక్కన పెట్టాలి. మందపాటి అడుగు ఉన్న గిన్నెలో నూనె వేసి అది వేడయ్యాక అల్లం తరుగు, వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. ఉప్పు, మిరియాల పొడితో మారినేట్‌ చేసిన చికెన్‌ని తీసుకోవాలి. దీనికి థాయ్‌ గ్రీన్‌ కర్రీ పేస్ట్‌ కలిపి నిమిషం ఫ్రై చేసుకోవాలి. ఈ మిశ్రమంలో చికెన్‌స్టాక్‌, కొబ్బరి పాలు పోసి, తగినంత ఉప్పు వేసుకుని చిన్నమంటపై పది నిమిషాలు ఉడికించాలి. దీనికి కొత్తిమీర, నిమ్మరసం కలపాలి. ఈ సూప్‌లో రైస్‌ నూడుల్స్‌ వేసి సర్వ్‌ చేసుకోవాలి.


టిప్స్‌...

* కెనొలా ఆయిల్‌ వాడితే చాలా మంచి రుచి వస్తుంది. ఆ నూనె లేకపోతే ఏదైనా నూనె వాడొచ్చు.  

* చికెన్‌స్టాక్‌ టిన్స్‌ రూపంలో స్టోర్‌లో కొనుక్కోవచ్చు లేదా ఇంట్లోనే తయారుచేసుకోవచ్చు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని