నోరూరించే పాలక్‌ ప్రాన్స్‌!

కావాల్సినవి: రొయ్యలు- 200 గ్రా., (పొట్టు తీసి శుభ్రం చేసుకోవాలి), పాలకూర తరుగు- రెండు కప్పులు, ఉల్లిపాయ- ఒకటి (సన్నగా తరగాలి), అల్లంవెల్లుల్లి పేస్టు- రెండు చెంచాలు, కారం, ధనియాల పొడి- చెంచా చొప్పున, పసుపు- చిటికెడు, ఉప్పు- రుచికి తగినంత, పచ్చిమిర్చి- రెండు (సన్నగా తరగాలి), నూనె- సరిపడా, గరంమసాలా- చెంచా.

Updated : 19 Dec 2021 05:55 IST

కావాల్సినవి: రొయ్యలు- 200 గ్రా., (పొట్టు తీసి శుభ్రం చేసుకోవాలి), పాలకూర తరుగు- రెండు కప్పులు, ఉల్లిపాయ- ఒకటి (సన్నగా తరగాలి), అల్లంవెల్లుల్లి పేస్టు- రెండు చెంచాలు, కారం, ధనియాల పొడి- చెంచా చొప్పున, పసుపు- చిటికెడు, ఉప్పు- రుచికి తగినంత, పచ్చిమిర్చి- రెండు (సన్నగా తరగాలి), నూనె- సరిపడా, గరంమసాలా- చెంచా.

తయారీ: పాన్‌లో కొద్దిగా నూనె వేసి వేడి చేయాలి. అందులో రొయ్యల్ని వేసి పచ్చివాసన పోయేవరకు చిన్నమంటపై వేయించి పక్కన పెట్టుకోవాలి. మరో పాన్‌లో మరికొద్దిగా నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి తరుగు, పసుపు, అల్లంవెల్లుల్లి ముద్ద వేసి రెండు నిమిషాలు వేయించాలి. ఈ మిశ్రమంలోనే శుభ్రంగా కడిగి పెట్టుకున్న రొయ్యలు, కారం, ధనియాల పొడి కలిపి మరికాసేపు మగ్గించాలి. ఆ తర్వాత పాలకూర తరుగు, ఉప్పు కలిపి మూత పెట్టాలి. పాలకూర కాస్త మగ్గిన తర్వాత కప్పు నీళ్లు పోసి మరికాసేపు ఉడికించాలి. (పాలకూర తరుగు బదులుగా దాన్ని ఉడికించి పేస్ట్‌ చేసి కూడా కలపొచ్చు.) రొయ్యలు ఉడికి కూర కాస్త చిక్కబడ్డాక గరంమసాలా పొడి వేసి దించేయాలి. వేడి వేడి అన్నంతో లేదా చపాతీతో తింటే చాలా రుచిగా ఉంటుంది.

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు