పరీక్షలో సత్తా చాటండి.. ఉచితంగా నాసా ట్రిప్‌కి వెళ్లే అవకాశం పొందండి.. (ప్రకటన)

డాక్టర్‌‌, ఇంజినీర్‌ కలల్ని సాకారం చేసుకొనే దిశగా ఆలోచించే విద్యార్థులకు ఆకాశ్‌ సువర్ణ అవకాశం కల్పిస్తోంది. ప్రస్తుతం 7వ తరగతి నుంచి 12వ తరగతి ..........

Updated : 30 Jul 2022 16:09 IST

డాక్టర్‌‌, ఇంజినీర్‌ కావాలన్న కలల్ని సాకారం చేసుకొనే దిశగా ఆలోచించే విద్యార్థులకు ‘ఆకాశ్‌’ ఓ సువర్ణావకాశం కల్పిస్తోంది. ప్రస్తుతం 7వ తరగతి నుంచి 12వ తరగతి చదువుతున్న విద్యార్థులకు ఆకాశ్‌ జాతీయ ప్రతిభాన్వేషణ (ANTHE 2021) పేరుతో ఓ పరీక్ష నిర్వహించనుంది. డిసెంబర్‌ 11 నుంచి 19 వరకు ఆన్‌లైన్‌/ఆఫ్‌లైన్‌ పద్ధతుల్లో ఈ పరీక్ష జరగనుంది. ఈ జాతీయ స్థాయి స్కాలర్‌షిప్‌ పరీక్షలో సత్తాచాటిన విద్యార్థులకు 100 శాతం వరకు స్కాలర్‌షిప్‌తో పాటు నగదు పురస్కారాలు, ఉచితంగా నాసా ట్రిప్‌కి వెళ్లే అవకాశం కల్పించనుంది. వీటికితోడు ANTHE 2021 పరీక్ష ద్వారా అదనంగా ఆకాశ్‌ బైజూస్‌లో అందుబాటులో ఉండే వేర్వేరు నీట్‌, జేఈఈ కోర్సులకు స్కాలర్‌షిప్‌లు పొందొచ్చు. వైద్య, ఇంజినీరింగ్‌ ప్రవేశ పరీక్షలకు సిద్ధం కావాలనే విద్యార్థులకు ఇది ఉపకరిస్తుంది. విద్యార్థుల బలాలతో పాటు వారు ఎక్కడ వెనుకబడి ఉన్నారో గుర్తించి ఆ సమస్యను ఆకాశ్‌ బైజూస్‌లో అత్యంత అనుభవజ్ఞులైన అధ్యాపకుల మార్గదర్శకత్వంలో అధిగమించేందుకు ఈ పరీక్ష ఉపయోగపడుతుంది.

ANTHE 2021 పరీక్ష ముఖ్యాంశాలు..

* ANTHE అంటే ఆకాశ్‌ నేషనల్‌ టాలెంట్‌ హంట్‌ ఎగ్జామ్‌ (ఆకాశ్‌ జాతీయ ప్రతిభాన్వేషణ పరీక్ష)

* అర్హత - 7, 8, 9, 10, 11, 12 తరగతులు చదువుతున్నవారంతా అర్హులే

* పరీక్ష రుసుము - ₹99 (జీఎస్టీతో కలిపి)

* పరీక్ష ఏ ఫార్మాట్‌లో - ఆన్‌లైన్‌/ఆఫ్‌లైన్‌ పద్ధతుల్లో ఉంటుంది

* రిజిస్ట్రేషన్లకు తుది గడువు: ఆన్‌లైన్‌లో రాయాలనుకొనేవారు పరీక్ష తేదీకి మూడు రోజుల ముందు వరకు రిజిస్ట్రేషన్‌ చేసుకోవచ్చు.. అదే ఆఫ్‌లైన్‌ పరీక్షకు అయితే ఏడు రోజుల ముందు వరకు అవకాశం ఉంటుంది.

* పరీక్ష తేదీలు - ఆన్‌లైన్‌లో డిసెంబర్‌ 11 నుంచి 19 తేదీ వరకు/ ఆఫ్‌లైన్‌లో డిసెంబర్‌ 12 & డిసెంబర్‌ 19

* పరీక్ష సమయం- ఆన్‌లైన్‌ పరీక్ష ఉదయం 10గంటల నుంచి రాత్రి 7గంటల మధ్య ఎప్పుడైనా విద్యార్థి లాగిన్‌ అవ్వొచ్చు; ఆఫ్‌లైన్‌ పరీక్ష అయితే - ఉదయం శ్లాట్‌లో 10.30 గంటల నుంచి ఉదయం 11.30గంటల వరకు;  సాయంత్రం శ్లాట్‌లో సాయంత్రం 4 గంటల నుంచి 5గంటల వరకు పరీక్ష ఉంటుంది.

ఫలితాలు ఎప్పుడు?

10, 11, 12 తరగతులు చదువుతున్న విద్యార్థులకు సంబంధించి ఈ పరీక్ష ఫలితాలు వచ్చే ఏడాది జనవరి 2న ప్రకటిస్తారు. అదే 7, 8, 9 తరగతులు చదువుతున్న విద్యార్థుల ఫలితాలైతే 2022 జనవరి 4న ప్రకటిస్తారు.

ANTHE 2021కి ఎందుకు రిజిస్టర్‌ చేసుకోవాలి?

* డాక్టర్‌ లేదా ఇంజినీర్‌ కావాలనే కలను నెరవేర్చుకొనేందుకు

* 100 శాతం వరకు స్కాలర్‌షిప్‌ పొందేందుకు 

* నాసా ట్రిప్‌కు ఉచితంగా వెళ్లే అవకాశం పొందేందుకు

* నగదు పురస్కారాలు గెలుచుకొనేందుకు

* ఆల్‌ ఇండియా స్థాయిలో మీ ర్యాంకు చెక్‌ చేసుకొనేందుకు

* స్కూల్‌లో బూస్టర్‌ కోర్సుల్లో ఉచితంగా ప్రవేశించేందుకు (మెరిట్‌నేషన్‌)

ANTHE 2021 కోసం ఎలా రిజిస్టర్‌ చేసుకోవాలి?

1. మీ మొబైల్‌ నంబర్‌ ఎంటర్‌ చేయాలి

2. మీ రిజిస్టర్‌ నంబర్‌కు వచ్చే ఓటీపీని ఎంటర్‌ చేయాలి

3. మీ వివరాలను ఇవ్వడంతో పాటు పరీక్ష రుసుం చెల్లించాలి

4. అవసరమైన వివరాలతో రిజిస్ట్రేషన్‌ పూర్తి చేయాలి

5. రిజిస్ట్రేషన్‌ సక్సెస్‌ అయ్యాక మీరు ANTHE 2021 అడ్మిట్‌ కార్డును పొందొచ్చు. దీంతోపాటు ఉచితంగా బూస్టర్‌ కోర్స్‌ను కూడా పొందొచ్చు.

ANTHE 2021తో ప్రయోజనమేంటి?

100శాతం వరకు స్కాలర్‌షిప్, నగదు పురస్కారాలు గెలుచుకోవడంతో పాటు ఈ కింది ప్రయోజనాలు కూడా ఉన్నాయి.

ఉచితంగా నాసా ట్రిప్‌: స్కాలర్‌షిప్‌, నగదు పురస్కారాలతో పాటు ఈ పరీక్షలో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన టాప్‌-5 విద్యార్థులు ఉచితంగా నాసా ట్రిప్‌ గెలుచుకుంటారు.

ఆకాశ్‌ బైజూస్‌ నిపుణులతో గైడెన్స్‌: ANTHE పరీక్ష అఖిలభారత స్థాయిలో విద్యార్థులు తమ సామర్థ్యాన్ని అంచనా వేసుకొనేందుకు ఉపయోగపడుతుంది. అంతేకాకుండా ఆకాశ్‌ బైజూస్‌ నిపుణుల మార్గదర్శకత్వంలో నీట్‌, జేఈఈ వంటి వైద్య‌, ఇంజినీరింగ్‌ ప్రవేశ పరీక్షలకు సన్నద్ధతను ప్రారంభించేందుకు కూడా సహకరిస్తుంది. 

స్కూల్‌ బూస్టర్‌ కోర్సులోకి ప్రవేశం: ANTHE 2021 పరీక్షకు రిజిస్టర్‌ చేసుకోవడం ద్వారా విద్యార్థులు మెరిట్‌నేషన్‌ స్కూల్‌ బూస్టర్‌ కోర్సులోకి ప్రవేశించవచ్చు. పాఠశాల విద్యార్థుల కోసం ఎంతో జాగ్రత్తగా రూపొందించిన ఈ కోర్సు వారిని స్వతహాగా నేర్చుకొనేలా ప్రేరణ కల్పిస్తుంది. అంతేగాకుండా స్వతంత్రంగా స్వీయ ప్రేరణ పొందిన అభ్యాసకులుగా మారడానికి వారికి ఉపకరిస్తుంది. ఈ కోర్సు విద్యార్థులకు మంచి పునాదిని వేయడం ద్వారా పాఠశాలలో జరిగే ప్రతి పరీక్షలో వారిని మేటిగా నిలుపుతుంది.

 

ఆకాశ్ గురించి..

1988లో ప్రారంభమైన ఆకాశ్‌ సంస్థకు 33 ఏళ్లకు పైగా సుదీర్ఘ చరిత్ర ఉంది. జాతీయ స్థాయిలో పరీక్షలకు సన్నద్ధం చేసే పరిశ్రమల్లో ఎంతో ప్రఖ్యాతిగాంచిన సంస్థగా పేరుగాంచింది. దేశవ్యాప్తంగా 200లకు పైగా కేంద్రాలు.. 2200 మందికి పైగా అనుభజ్ఞులైన అధ్యాపక సిబ్బంది కలిగిన ఆకాశ్‌.. 2.5లక్షల మందికి పైగా విద్యార్థులు, నీట్‌, జేఈఈల్లో 85 వేలకు పైగా ర్యాంకర్లుతో సత్తా చాటుతోంది. అభ్యాస ప్రక్రియను మరో లెవెల్‌కు తీసుకెళ్లడమే లక్ష్యంగా ఆకాశ్ ఇప్పుడు దేశంలోనే అతి పెద్ద ఎడ్‌-టెక్‌ సంస్థగా అవతరించిన బైజూస్‌తో చేతులు కలిపింది. ఆ సంస్థ సాంకేతిక ఆధారిత లెర్నింగ్ సొల్యూషన్‌లో ప్రపంచంలోనే మేటిగా నిలుస్తోంది. ఆకాశ్‌ బైజూస్‌ వైద్య, ఇంజినీరింగ్‌ కోర్సుల్లో ప్రవేశ పరీక్షలతో పాటు స్కూల్‌/బోర్డు పరీక్షలు, కేవీపీవై, ఎన్‌టీఎస్‌ఈ, ఒలింపియాడ్‌ ఇతర ఫౌండేషన్‌ స్థాయి పరీక్షలకు సన్నద్ధమవుతున్న విద్యార్థులకు సమగ్రమైన పరీక్ష సన్నాహక సేవలను అందిస్తోంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని