ఏ బ్రాంచిలో ఏముంది?

దేశ ఆర్థిక ప్రగతిని నిర్దేశించే సాంకేతిక పరిజ్ఞానాన్ని సమకూర్చుకునే మార్గం- ఇంజినీరింగ్‌. ఈ వృత్తివిద్యా కోర్సులు పూర్తిచేసినవారు సరైన నైపుణ్యం సంపాదించి చిన్నతరహా పరిశ్రమల నుంచి బహుళ జాతి సంస్థల వరకు ప్రతిచోటా ఉపాధి అవకాశాలు పొందవచ్చు. ఇంజినీరింగ్‌ విద్యార్థులు పాఠ్యాంశాలను ఆచరణాత్మకంగా నేర్చుకుంటారు....

Published : 13 Oct 2020 01:01 IST

ఇంజినీరింగ్‌లో ఎన్ని కోర్సులు ఉన్నప్పటికీ ఎక్కువమంది విద్యార్థులను ఆకర్షించే ప్రధాన బ్రాంచిలు కొన్ని ఉన్నాయి. వీటి ముఖ్యాంశాలను తెలుసుకుందాం!

దేశ ఆర్థిక ప్రగతిని నిర్దేశించే సాంకేతిక పరిజ్ఞానాన్ని సమకూర్చుకునే మార్గం- ఇంజినీరింగ్‌. ఈ వృత్తివిద్యా కోర్సులు పూర్తిచేసినవారు సరైన నైపుణ్యం సంపాదించి చిన్నతరహా పరిశ్రమల నుంచి బహుళ జాతి సంస్థల వరకు ప్రతిచోటా ఉపాధి అవకాశాలు పొందవచ్చు. ఇంజినీరింగ్‌ విద్యార్థులు పాఠ్యాంశాలను ఆచరణాత్మకంగా నేర్చుకుంటారు. దీంతో దేశ విదేశాల్లో ఉన్నత విద్యాకోర్సులు చదువుకునేలా, ఉద్యోగావకాశాలను అందిపుచ్చుకునేలా వారి ఆలోచనా విధానం నైపుణ్యతను సంతరించుకుంటుంది.  


కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ ఇంజినీరింగ్‌; ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ

ప్రోగ్రామింగ్‌ను కెరియర్‌గా చేసుకోవాలనుకునేవారికి ఈ బ్రాంచీలు ఉత్తమ ఎంపిక.
కంప్యూటర్‌ సైన్స్‌; ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ విభాగాల్లో చేరే విద్యార్థులు కాలానుగుణంగా నైపుణ్యాలను పెంపొందించుకోవాల్సివుంటుంది. వీరు కోడింగ్‌లో మెలకువలను నేర్చుకోవడం ద్వారా బహుళజాతి సంస్థల్లో సులువుగా ఉద్యోగాలు సంపాదించుకోవచ్చు. ఐదు లక్షల రూపాయిల కనీస వేతనంతో వచ్చే కంపెనీలు కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ ఇంజినీరింగ్‌ విభాగం నుంచే ఎక్కువగా నియామకాలు జరుపుకుంటున్నాయి.
అన్ని రంగాల్లో కంప్యూటర్‌ వినియోగం పెరగడంతో ఐటీ రంగంలో ఉద్యోగావకాశాలు అత్యధికంగా ఉన్నాయి. ఆర్టిఫిషియల్‌ ఇంటలిజెన్స్‌, మెషిన్‌ లర్నింగ్‌, సైబర్‌ సెక్యూరిటీ, క్లౌడ్‌ కంప్యూటింగ్‌, బ్లాక్‌ చైన్‌ టెక్నాలజీ, డేటా అనలిటిక్స్‌, ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌, 5జీ టెక్నాలజీలపై పట్టు సాధించిన విద్యార్థులకు గూగుల్‌ మైక్రోసాఫ్ట్‌, ఫ్లిప్‌కార్ట్‌, అమెజాన్‌, మైక్రాన్‌ వంటి బహుళజాతి సంస్థల్లో అధిక వేతనాలతో ఉద్యోగాలు లభిస్తున్నాయి. అంతే కాదు; సొంతంగా స్టార్ట్టప్‌నో, కంప్యూటర్స్‌ సంస్థనో స్థాపించి ఇతరులకూ ఉద్యోగావకాశాలను కల్పించవచ్చు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని