దీని తీరే వేరు

‘సహానుభూతి’ అనేది సహజసిద్ధంగా పెంపొందించుకోవాల్సిన జీవన నైపుణ్యం. భావవ్యక్తీకరణ లాంటి నైపుణ్యాలను శిక్షణ ద్వారా నేర్చుకోవచ్చు. కానీ సహానుభూతి చాలావరకూ వ్యక్తిత్వంలో పొదిగివుండే

Published : 04 Jan 2021 01:51 IST

‘సహానుభూతి’ అనేది సహజసిద్ధంగా పెంపొందించుకోవాల్సిన జీవన నైపుణ్యం. భావవ్యక్తీకరణ లాంటి నైపుణ్యాలను శిక్షణ ద్వారా నేర్చుకోవచ్చు. కానీ సహానుభూతి చాలావరకూ వ్యక్తిత్వంలో పొదిగివుండే లక్షణం. అందువల్లే దీన్ని కృతకంగా అరువు తెచ్చుకోలేం. తోటివారిపై ఆసక్తి చూపడం ద్వారా మాత్రమే దీన్ని సాధించగలం.
కెరియర్‌ ఉన్నతికి జీవన నైపుణ్యాలు- 3
మహాత్మాగాంధీని జాతిపితగా, జేఆర్‌డీ టాటాను భారత పారిశ్రామిక పితామహుడిగా, ఇన్ఫోసిస్‌ నారాయణమూర్తిని భారత ఐటీ దిగ్గజంగా, బాలీవుడ్‌ విలన్‌ సోనూసూద్‌ను లాక్‌డౌన్‌ హీరోగా నిలిపిందేమిటి? వారి రంగాల్లో గొప్ప ప్రతిభ చూపినందువల్ల మాత్రమే కాదు. వీరందరిలోనూ నిక్షిప్తమైన ఒక లక్షణం మనందరి హృదయాలకు దగ్గర చేసింది. అదే సహానుభూతి (ఎంపతీ). ఏ రంగంలో ఉన్నా సహానుభూతి ఉన్నవారు దానిలో ధ్రువతారల్లా మెరుస్తుంటారు! సహానుభూతి అంటే.. ఇతరులను అర్థం చేసుకోవడం. ఇతరుల అవసరాలను సకాలంలో గుర్తించగలిగే సామర్థ్యం. పరుల మనోభావాలు, కోర్కెలు, అవసరాలను అర్థం చేసుకోగలగడం. మన చుట్టూ ఉన్నవారితో సత్సంబంధాలు ఏర్పరచుకుని, అవి దీర్ఘకాలం కొనసాగాలంటే సహానుభూతి ఉండాలి. మనకు ఎలాంటి అవసరాలు ఉంటాయో ఎదుటివారికీ అలాంటివే ఉంటాయనే అవగాహన గాఢంగా ఉండాలి. తన గురించి మాత్రమే 24 గంటలూ ఆలోచిస్తూ అదే స్వార్థంతో ప్రతి పనీ చేయకుండా పరుల గురించీ ఆలోచించడం, వారి భావాలను అర్థం చేసుకోవడం ఎంత గాఢంగా ఉంటే వారు ప్రజలకు అంత దగ్గరవుతారు. అంద]ుకే సహానుభూతిని ఒక జీవన నైపుణ్యం (లైఫ్‌ స్కిల్‌)గా వర్గీకరించారు.

- యస్‌.వి. సురేష్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని