ఈఎస్‌ఈ.. గేట్‌ ఏ పోలికలు? ఏ తేడాలు? 

ఇంజినీరింగ్‌ విద్యార్థులు ఏటా జాతీయస్థాయిలో రాసే పరీక్షలు...గేట్, ఈఎస్‌ఈ. సాధారణంగా ఎక్కువమంది

Updated : 14 Oct 2021 11:28 IST

ఇంజినీరింగ్‌ విద్యార్థులు ఏటా జాతీయస్థాయిలో రాసే పరీక్షలు...గేట్, ఈఎస్‌ఈ. సాధారణంగా ఎక్కువమంది ఈ రెండు పరీక్షలకూ సిద్ధమవుతుంటారు. ఉమ్మడి ప్రిపరేషన్‌ సాగిస్తుంటారు. ఈ సందర్భంగా వీటిలో మెరుగైన స్కోరు సాధించదలిచిన విద్యార్థులు గేట్, ఈఎస్‌ఈల మధ్య సారూప్యాలూ, భేదాలూ తెలుసుకోవటం చాలా అవసరం. 
గేట్, ఈఎస్‌ఈ (ప్రిలిమ్స్‌) రెండూ ఫిబ్రవరి నెలలోనే జరగనున్నాయి. ఈ పరీక్షలకు దాదాపుగా నాలుగున్నర నెలల కాలవ్యవధి ఉంది. అందుబాటులో ఉన్న ఈ సమయాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకుని సన్నద్ధతను కొనసాగించాలి. గేట్, ఈఎస్‌ఈ (ప్రిలిమ్స్‌) సన్నద్ధత దాదాపుగా సమానమే. అయితే ఇప్పుడున్న సమయంలో గేట్‌తోపాటు ఈఎస్‌ఈ ప్రిలిమ్స్‌ పరీక్షపై మాత్రమే దృష్టి సారించాలి.

గేట్‌తోపాటు ఈఎస్‌ఈ కూడా రాయదలిచినవారు టెక్నికల్‌ సబ్జెక్టులతో పాటు జనరల్‌ స్టడీస్‌లోని పది అంశాలపై కూడా శ్రద్ధ వహించాలి. జనరల్‌ స్టడీస్‌ విషయంలో ప్రాథమిక అంశాలపై ఎక్కువ శ్రద్ధ వహించాలి. 

> ఈఎస్‌ఈ ప్రిలిమ్స్‌ జనరల్‌ స్టడీస్‌లోని జనరల్‌ ఆప్టిట్యూడ్, మ్యాథమేటిక్స్‌ అనేవి రెండు పరీక్షల్లో ఉంటాయి. అభ్యర్థులు తమ విభాగానికి సంబంధించిన జనరల్‌ స్టడీస్‌ అంశాలపై తగినంత పట్టు సాధిస్తే ఇందులో 200 మార్కులకు 100 మార్కులు పొందవచ్చు.

> ఈఎస్‌ఈ కోసం అభ్యర్థులు సబ్జెక్టులను లోతుగా అధ్యయనం చేయాలి. గేట్‌లో సబ్జెక్టు ప్రాథమికాంశాలు (బేసిక్స్‌), వాటి ఉపయోగాలపై ప్రశ్నలు ఎక్కువగా వస్తాయి. 

> అభ్యర్థులు మొదటగా సబ్జెక్టుల వెయిటేజిని దృష్టిలో ఉంచుకుని సన్నద్ధం కావాలి. అంటే ఈ రెండు పరీక్షలకు ఎక్కువ వెయిటేజి ఉన్న సబ్జెక్టులను విస్మరించకుండా సమగ్రంగా సన్నద్ధం కావాలి. ఇలా చేయడం వల్ల రెండు పరీక్షలకూ ఏకకాలంలో సిద్ధమవుతున్నట్లు భావించవచ్చు.

ఈ రెండు పరీక్షల్లో ఎక్కువ ప్రశ్నలు 4 నుంచి 5 స్టెప్‌లలో సమాధానం రాబట్టేలా ఉంటాయి. అలాంటి ప్రశ్నలను ఎక్కువగా సాధన చేయాలి. 

ఇవీ పోలికలు

ఈఎస్‌ఈ (ప్రిలిమ్స్‌), గేట్‌ పరీక్షల సిలబస్‌ దాదాపుగా సమానం.

ఈఎస్‌ఈ సిలబస్‌.. గేట్‌ సిలబస్‌తో పోలిస్తే ఎక్కువ.

ఈఎస్‌ఈ (ప్రిలిమ్స్‌), గేట్‌ పరీక్షలు రెండూ ఆబ్జెక్టివ్‌ విధానంలో జరుగుతాయి.- ప్రొ. వై.వి. గోపాలకృష్ణమూర్తి, ఏస్‌ ఇంజినీరింగ్‌ అకాడమీ 

 


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని