నోటీస్‌బోర్డు 1

న్యూదిల్లీలోని యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌(యూపీఎస్సీ) కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది....

Published : 24 Feb 2020 00:15 IST

ప్రభుత్వ ఉద్యోగాలు
యూపీఎస్సీ- 41 పోస్టులు

న్యూదిల్లీలోని యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌(యూపీఎస్సీ) కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం ఖాళీలు: 41 పోస్టులు-ఖాళీలు: జూనియర్‌ సైంటిఫిక్‌ ఆఫీసర్‌-02, సైంటిస్ట్‌-38, ఎకనమిస్ట్‌-01.
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో ఇంజినీరింగ్‌ డిగ్రీ, మాస్టర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణత, అనుభవం. ఎంపిక విధానం: రిక్రూట్‌మెంట్‌ టెస్ట్‌, ఇంటర్వ్యూ ఆధారంగా. దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌.
చివరితేది: మార్చి 12, 2020.

వెబ్‌సైట్‌:
https://www.upsc.gov.in/


తెలంగాణ హైకోర్టు

హైదరాబాద్‌లోని తెలంగాణ హైకోర్టు కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
* సివిల్‌ జడ్జి మొత్తం ఖాళీలు: 70

అర్హత: లా డిగ్రీ ఉత్తీర్ణత, ఏదైనా కోర్టులో అడ్వకేట్‌/ ప్లీడర్‌గా మూడేళ్ల అనుభవం. వయసు: 25-35 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక విధానం: రాతపరీక్ష ఆధారంగా.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌.దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: మార్చి 13, 2020. దరఖాస్తుకు చివరితేది: ఏప్రిల్‌ 13, 2020.

వెబ్‌సైట్‌: 
http://hc.ts.nic.in/
 


అప్రెంటిస్‌షిప్‌
హిందుస్థాన్‌ కాపర్‌ లిమిటెడ్‌

మధ్యప్రదేశ్‌లోని హిందుస్థాన్‌ కాపర్‌ లిమిటెడ్‌ కింది అప్రెంటిస్‌ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
*ట్రేడ్‌ అప్రెంటిస్‌ మొత్తం ఖాళీలు: 120 ట్రేడులు: ఎలక్ట్రీషియన్‌, వెల్డర్‌, ఫిట్టర్‌, టర్నర్‌, డ్రాఫ్ట్స్‌మెన్‌, సర్వేయర్‌, కార్పెంటర్‌, ప్లంబర్‌ తదితరాలు.

అర్హత: పదోతరగతి, సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ ఉత్తీర్ణత. వయసు: 31.01.2020 నాటికి 25 ఏళ్లు మించకూడదు.
ఎంపిక విధానం: రాతపరీక్ష ఆధారంగా. పరీక్షతేది: మార్చి 29, 2020. దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌. చివరితేది:  మార్చి 12, 2020.
వెబ్‌సైట్‌:
https://www.hindustancopper.com/


ప్రవేశాలు
బీఆర్‌ఏఓయూ అర్హత పరీక్ష-2020

హైదరాబాద్‌(జూబ్లిహిల్స్‌)లోని డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ సార్వత్రిక విశ్వవిద్యాలయం (బీఆర్‌ఏఓయూ) 2020-21 విద్యాసంవత్సరానికి కింది ప్రోగ్రాముల్లో ప్రవేశానికి అర్హత పరీక్ష-2020 నోటిఫికేషన్‌ విడుదల చేసింది.
*బీఏ/ బీకాం/ బీఎస్సీ( మూడేళ్ల డిగ్రీ) ప్రోగ్రాముల్లో మొదటి సంవత్సరంలో ప్రవేశానికి అర్హత పరీక్ష-2020

అర్హత: ఇంటర్మీడియట్‌/ తత్సమాన పరీక్ష ఉత్తీర్ణులు కాని అభ్యర్థులు అర్హులు. వయసు: 01, జులై 2020 నాటికి 18 ఏళ్లు నిండి ఉండాలి.ఎంపిక విధానం: అర్హత పరీక్ష ఆధారంగా.
పరీక్షతేది: ఏప్రిల్‌ 19, 2020. దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌.
చివరితేది: ఏప్రిల్‌ 04, 2020.
https://www.braouonline.in/


మరిన్ని నోటిఫికేషన్లకు QR కోడ్‌ స్కాన్‌ చేయవచ్చు లేదా www.eenadupratibha.net చూడవచ్చు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని