నోటీస్‌బోర్డు

యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (యూపీఎస్సీ) కేంద్ర ప్రభుత్వానికి చెందిన వివిధ మంత్రిత్వశాఖల్లో కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

Published : 14 Dec 2020 00:40 IST

ప్రభుత్వ ఉద్యోగాలు
యూపీఎస్సీ-34 ఖాళీలు

యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (యూపీఎస్సీ) కేంద్ర ప్రభుత్వానికి చెందిన వివిధ మంత్రిత్వశాఖల్లో కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం ఖాళీలు: 34
పోస్టులు-ఖాళీలు: అసిస్టెంట్‌ లీగల్‌ అడ్వైజర్‌-02, మెడికల్‌ ఫిజిసిస్ట్‌-04, పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌-10, అసిస్టెంట్‌ ఇంజినీర్‌ (ఎలక్ట్రికల్‌)-18.
అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో బ్యాచిలర్స్‌ డిగ్రీ, బీఈ/ బీటెక్‌, మాస్టర్స్‌ డిగ్రీ, మెడికల్‌ పీజీ డిగ్రీ ఉత్తీర్ణత, అనుభవం.
ఎంపిక విధానం: రిక్రూట్‌మెంట్‌ టెస్ట్‌, ఇంటర్వ్యూ ఆధారంగా.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.
దరఖాస్తుకు చివరి తేది: డిసెంబరు 31, 2020.
వెబ్‌సైట్‌: https://www.upsc.gov.in/


బార్క్‌లో 105 జేఆర్‌ఎఫ్‌ ఖాళీలు

భారత ప్రభుత్వానికి చెందిన బాబా అటమిక్‌ రిసెర్చ్‌ సెంటర్‌(బార్క్‌) జూనియర్‌ రిసెర్చ్‌ ఫెలోషిప్‌(జేఆర్‌ఎఫ్‌) ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
* జూనియర్‌ రిసెర్చ్‌ ఫెలోషిప్‌ (జేఆర్‌ఎఫ్‌)
మొత్తం ఫెలోషిప్‌ల సంఖ్య: 105
అర్హత: ఎమ్మెస్సీ/ ఇంటిగ్రేటెడ్‌ ఎమ్మెస్సీ (ఫిజిక్స్‌/ కెమిస్ట్రీ/ లైఫ్‌ సైన్సెస్‌) ఉత్తీర్ణత.
ఎంపిక విధానం: అర్హత పరీక్షల్లో సాధించిన వాలిడ్‌ స్కోర్‌(యూజీసీ-సీఎస్‌ఐఆర్‌-నెట్‌ ఫెలోషిప్‌, జస్ట్‌ స్కోర్‌ తదితరాలు), ఇంటర్వ్యూలో ప్రతిభ ఆధారంగా.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌.
దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 2020 డిసెంబరు 18.
దరఖాస్తుకు చివరి తేది: 2021 జనవరి 15.
వెబ్‌సైట్‌: https://recruit.barc.gov.in/


ఏది సరైనది? spouse భర్తా? భార్యా?

స్పౌజ్‌ అనే ఇంగ్లిష్‌ మాటను భర్త అనే అర్థంలో వాడాలో, భార్య అనే అర్థంలో వాడాలో తెలియక చాలామంది తికమక పడుతుంటారు.
ఈ పదం భర్తకూ, భార్యకూ- ఇద్దరికీ వర్తిస్తుంది. అంటే ఈ టర్మ్‌.. gender neutral.  స్పష్టంగా చెప్పాలంటే..
Male spouse- husband ; Female spouse- wife
wife కు husband ఆమె spouse అవుతాడు.
husband కు ‌wife అతని spouse అవుతుంది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని