పరీక్షల్లో నెగ్గితే పదిలమైన కొలువు!

ఎలైట్‌ నేషనల్‌ టాలెంట్‌ హంట్‌ (ఎన్‌టీహెచ్‌)-2021 పేరుతో విప్రో దేశవ్యాప్తంగా ఉన్న ఇంజినీరింగ్‌ ఫ్రెషర్ల కోసం ప్రతిభాన్వేషణ పరీక్షకు సిద్ధమైంది.

Published : 14 Dec 2020 00:40 IST

ఇంజినీరింగ్‌ విద్యార్థుల కోసం.. విప్రో ఎలైట్‌- 2021

ప్రముఖ సాఫ్ట్‌వేర్‌ సంస్థ విప్రో బీఈ/ బీటెక్‌, ఇంటిగ్రేటెడ్‌ ఎంటెక్‌ ఆఖరు సంవత్సరం చదువుతోన్న విద్యార్థులకు ఉద్యోగాలు ఇవ్వడానికి ముందుకొచ్చింది. ఇందుకోసం ఎలైట్‌- 2021 పేరుతో పరీక్షలు నిర్వహించనుంది. ఎంపికైనవారికి రూ.3.5 లక్షల వార్షిక వేతనం దక్కుతుంది. ఆన్‌లైన్‌ పరీక్ష, ఇంటర్వ్యూల్లో చూపిన ప్రతిభతో నియామకాలు చేపడతారు. ఆసక్తి ఉన్న అభ్యర్థుల నుంచి రిజిస్ట్రేషన్లు ఆహ్వానిస్తున్నారు.
ఎలైట్‌ నేషనల్‌ టాలెంట్‌ హంట్‌ (ఎన్‌టీహెచ్‌)-2021 పేరుతో విప్రో దేశవ్యాప్తంగా ఉన్న ఇంజినీరింగ్‌ ఫ్రెషర్ల కోసం ప్రతిభాన్వేషణ పరీక్షకు సిద్ధమైంది. కంప్యూటర్‌ సైన్స్‌, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ, సర్క్యూటల్‌ ఇంజినీరింగ్‌ విభాగాల్లో అత్యుత్తమ నైపుణ్యాలున్నవారిని ఒడిసిపట్టడానికి వీటిని నిర్వహిస్తోంది. ఇలా ఎంపికైనవారికి ప్రాజెక్ట్‌ ఇంజినీర్‌ హోదా కేటాయిస్తారు. చేరినవారు ఏడాది పాటు సంస్థలో కొనసాగడం తప్పనిసరి.
పదో తరగతి, ఇంటర్మీడియట్‌లో కనీసం 60 శాతం మార్కులు సాధించాలి. అలాగే బీటెక్‌/బీఈ/ఇంటిగ్రేటెడ్‌ ఎంటెక్‌లో 65 శాతం తప్పనిసరి. 2021లో బీటెక్‌ లేదా ఇంటిగ్రేటెడ్‌ ఎంటెక్‌ కోర్సులు పూర్తిచేసుకుంటున్నవారే అర్హులు. సీఎస్‌, ఐటీ, సర్క్యూటల్‌ బ్రాంచీలకు చెందిన విద్యార్థులకే అవకాశం ఉంది. పదో తరగతి నుంచి గ్రాడ్యుయేషన్‌ మధ్య అకడమిక్‌ విరామం మూడేళ్లకు మించరాదు.

ఎంపిక ఇలా: ఆన్‌లైన్‌ అసెస్‌మెంట్‌తో అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఇందుకోసం 128 నిమిషాల వ్యవధితో 3 సెక్షన్లలో పరీక్ష నిర్వహిస్తారు. ఆప్టిట్యూడ్‌, రిటర్‌ కమ్యూనికేషన్‌, ఆన్‌లైన్‌ ప్రోగ్రామింగ్‌ విభాగాల్లో అభ్యర్థిని పరీక్షిస్తారు. పరీక్షలో అర్హత సాధించినవారికి టెక్నికల్‌, హెచ్‌ఆర్‌ ఇంటర్వ్యూలు ఉంటాయి. వీటిలోనూ ప్రతిభ చూపితే శిక్షణకు ఎంపికచేస్తారు. దాన్ని విజయవంతంగా పూర్తిచేసుకున్నవారిని విధుల్లోకి తీసుకుంటారు.

పరీక్షలో...
ఆప్టిట్యూడ్‌: ఇందులో లాజికల్‌ ఎబిలిటీ, క్వాంటిటేటివ్‌ ఎబిలిటీ, ఇంగ్లిష్‌ (వెర్బల్‌) ఎబిలిటీ అంశాల నుంచి ప్రశ్నలు ఉంటాయి. వ్యవధి 48 నిమిషాలు.
రిటన్‌ కమ్యూనికేషన్‌: వ్యాసం రాయాలి. దీనికి 20 నిమిషాలు కేటాయించారు.
ఆన్‌లైన్‌ ప్రోగ్రామింగ్‌: కోడింగ్‌లో 2 ప్రోగ్రామ్‌లు రాయాలి. ఇందుకోసం జావా, సీ, సీ++, పైతాన్‌ ..వీటిలో దేనినైనా ఎంచుకోవచ్చు.వ్యవధి 60 నిమిషాలు.
ఆన్‌లైన్‌ దరఖాస్తులకు గడువు: జనవరి 5 అసెస్‌మెంట్‌ పరీక్షలు: జనవరి 18 నుంచి 23 వరకు ఉంటాయి.
https://careers.wipro.com/elite


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని