నోటీస్‌బోర్డు

ఇండియన్‌ ఆర్మీ..షార్ట్‌ సర్వీస్‌ కమిషన్‌ (ఎస్‌ఎస్‌సీ) ఆఫీసర్లుగా చేరేందుకు ఎన్‌సీసీ అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఇందుకుగాను ఎన్‌సీసీ స్పెషల్‌ ఎంట్రీ స్కీం 51వ కోర్సు(ఏప్రిల్‌ 2022) నోటిఫికేషన్‌ విడుదల చేసింది.

Updated : 11 Oct 2021 06:17 IST

ప్రభుత్వ ఉద్యోగాలు


ఇండియన్‌ ఆర్మీ-ఎన్‌సీసీ స్పెషల్‌ ఎంట్రీ కోర్సు

ఇండియన్‌ ఆర్మీ..షార్ట్‌ సర్వీస్‌ కమిషన్‌ (ఎస్‌ఎస్‌సీ) ఆఫీసర్లుగా చేరేందుకు ఎన్‌సీసీ అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఇందుకుగాను ఎన్‌సీసీ స్పెషల్‌ ఎంట్రీ స్కీం 51వ కోర్సు(ఏప్రిల్‌ 2022) నోటిఫికేషన్‌ విడుదల చేసింది. అవివాహిత పురుషులు, మహిళలు వీటికి అర్హులు.

* షార్ట్‌ సర్వీస్‌ కమిషన్‌(ఎస్‌ఎస్‌సీ) ఆఫీసర్లు

మొత్తం ఖాళీలు: 55

1) ఎన్‌సీసీ మెన్‌: 50 (జనరల్‌ కేటగిరీ-45, యుద్ధ ప్రమాదాల్లో గాయపడ్డ ఆర్మీ సిబ్బందికి-05)

2) ఎన్‌సీసీ ఉమెన్‌: 05 (జనరల్‌ కేటగిరీ-04, యుద్ధ ప్రమాదాల్లో గాయపడ్డ ఆర్మీ సిబ్బందికి-01) అర్హత: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత. డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్న వారు దరఖాస్తు చేసుకోవచ్ఛు దీనితో పాటు ఎన్‌సీసీ సీ సర్టిఫికెట్‌ ఉండాలి. నిర్దేశించిన శారీరక ప్రమాణాలు తప్పనిసరి.

* యుద్ధ ప్రమాదాల్లో గాయపడ్డ ఆర్మీ సిబ్బందికి కనీసం 50% మార్కులతో ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత. వీరికి ఎన్‌సీసీ సీ సర్టిఫికెట్‌ ఉండాల్సిన అవసరం లేదు. ఎంపిక: షార్ట్‌లిస్టింగ్‌, ఎస్‌ఎస్‌బీ ఇంటర్వ్యూ, మెడికల్‌ టెస్ట్‌ ఆధారంగా. దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా. దరఖాస్తులకు చివరి తేది: 2021, నవంబరు 03.

వెబ్‌సైట్‌: https://joinindianarmy.nic.in/


ఏపీపీఎస్సీ - 190 అసిస్టెంట్‌ ఇంజినీర్లు

విజయవాడలోని ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (ఏపీపీఎస్సీ) వివిధ ఇంజినీరింగ్‌ విభాగాల్లో కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీలు: 190 (క్యారీ ఫార్వర్డ్‌ ఖాళీలు-35, తాజా ఖాళీలు-155)

విభాగాలు: సివిల్‌, ఈఎన్‌వీ, మెకానికల్‌.

సర్వీసులు: ఏపీ ఆర్‌డబ్ల్యూఎస్‌ అండ్‌ ఎస్‌ ఇంజినీరింగ్‌ సబార్డినేట్‌ సర్వీస్‌, పీహెచ్‌ అండ్‌ ఎంఈ సబార్డినేట్‌ సర్వీస్‌ తదితరాలు.

అర్హత: పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో ఇంజినీరింగ్‌ డిప్లొమా, బీఈ/ బీటెక్‌, ఎల్‌సీఈ/ తత్సమాన ఉత్తీర్ణత.

వయసు: 01.07.2021 నాటికి 18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక విధానం: కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌ (సీబీటీ) ఆధారంగా.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 2021, అక్టోబరు 21.

దరఖాస్తులకు చివరి తేది: 2021, నవంబరు 11.

వెబ్‌సైట్‌: https://psc.ap.gov.in/


ఇండియన్‌ ఆర్మీ-10+2 టెక్నికల్‌ ఎంట్రీ స్కీమ్‌

ఇండియన్‌ ఆర్మీ.. జనవరి 2022లో ప్రారంభమయ్యే 10+2 టెక్నికల్‌ ఎంట్రీ స్కీమ్‌-46వ కోర్సుకు అవివాహిత పురుష అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఎంపికైన అభ్యర్థులకు ఐదేళ్ల శిక్షణ అనంతరం ఇంజినీరింగ్‌ డిగ్రీతోపాటు పర్మనెంట్‌ కమిషన్‌లో ఆఫీసర్లుగా నియమిస్తారు.

ఖాళీలు: 90

అర్హత: కనీసం 60శాతం మార్కులతో ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, మ్యాథ్స్‌ సబ్జెక్టులతో ఇంటర్మీడియట్‌/ తత్సమాన ఉత్తీర్ణత. జేఈఈ (మెయిన్స్‌) 2021 పరీక్షకి హాజరై ఉండాలి. నిర్దేశించిన శారీరక ప్రమాణాలు తప్పనిసరి.

వయసు: 16 1/2 నుంచి 19 1/2 సంవత్సరాల మధ్య ఉండాలి.

ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్‌, ఎస్‌ఎస్‌బీ ఇంటర్వ్యూ ఆధారంగా.

ఎస్‌ఎస్‌బీ ఇంటర్వ్యూలు: డిసెంబరు 2021 నుంచి.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

దరఖాస్తులకు చివరి తేది: 2021, నవంబరు 08.

వెబ్‌సైట్‌: https://joinindianarmy.nic.in/


యూపీఎస్సీ - 56 పోస్టులు

యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (యూపీఎస్సీ) వివిధ కేంద్ర మంత్రిత్వశాఖల్లో కింది పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీలు: 56

పోస్టులు: డేటా ప్రాసెసింగ్‌ అసిస్టెంట్‌, ప్రైవేటు సెక్రటరీ, సీనియర్‌ గ్రేడ్‌, జూనియర్‌ టైం స్కేల్‌, యూత్‌ ఆఫీసర్‌.

అర్హత: పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో బ్యాచిలర్స్‌ డిగ్రీ, మాస్టర్స్‌ డిగ్రీ, పీజీ/ పీజీ డిప్లొమా ఉత్తీర్ణత. టైపింగ్‌, ట్రాన్స్‌స్క్రిప్షన్‌ నైపుణ్యాలు, అనుభవం ఉండాలి.

ఎంపిక విధానం: రిక్రూట్‌మెంట్‌ టెస్ట్‌, ఇంటర్వ్యూ ఆధారంగా.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

రఖాస్తులకు చివరి తేది: 2021, అక్టోబరు 28.

వెబ్‌సైట్‌: https://www.upsc.gov.in/


ఏఎండీఈఆర్‌లో 124 ఖాళీలు

భారత ప్రభుత్వ అణుశక్తి విభాగానికి చెందిన అటామిక్‌ మినరల్స్‌ డైరెక్టరేట్‌ ఫర్‌ ఎక్స్‌ప్లొరేషన్‌ అండ్‌ రిసెర్చ్‌ (ఏఎండీఈఆర్‌) కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీలు: 124

పోస్టులు: సైంటిఫిక్‌ అసిస్టెంట్‌-బి, టెక్నీషియన్‌-బి, అప్పర్‌ డివిజన్‌ క్లర్క్‌, డ్రైవర్‌, సెక్యూరిటీ గార్ఢ్‌

విభాగాలు: ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, జియోలజీ, ఎలక్ట్రానిక్స్‌/ ఇన్‌స్ట్రుమెంటేషన్‌, కంప్యూటర్‌ సైన్స్‌ తదితరాలు.\

అర్హత: పోస్టుల్ని అనుసరించి పదో తరగతి, ఐటీఐ, సంబంధిత సబ్జెక్టుల్లో ఇంజినీరింగ్‌ డిప్లొమా, బీఎస్సీ ఉత్తీర్ణత, అనుభవం.

ఎంపిక విధానం: స్కిల్‌ టెస్ట్‌/రాత పరీక్ష/ఇంటర్వ్యూ ఆధారంగా.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

దరఖాస్తులకు చివరి తేది: 2021, నవంబరు 24.

వెబ్‌సైట్‌: https://www.amd.gov.in/


 


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని