యూపీఎస్సీ - 64 పోస్టులు

యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (యూపీఎస్సీ) వివిధ కేంద్ర మంత్రిత్వశాఖల్లో ఖాళీగా ఉన్న కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

Updated : 25 Oct 2021 06:25 IST

ప్రభుత్వ ఉద్యోగాలు

యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (యూపీఎస్సీ) వివిధ కేంద్ర మంత్రిత్వశాఖల్లో ఖాళీగా ఉన్న కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీలు: 64

పోస్టులు-ఖాళీలు: అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌-01, అసిస్టెంట్‌ డిఫెన్స్‌ ఎస్టేట్స్‌ ఆఫీసర్లు-06, సీనియర్‌ సైంటిఫిక్‌ ఆఫీసర్లు-16, అసిస్టెంట్‌ డైరెక్టర్లు-33, మెడికల్‌ ఆఫీసర్లు-08.

అర్హత: పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో డిగ్రీ, బీఈ/ బీటెక్‌, మాస్టర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణత, అనుభవం.

ఎంపిక విధానం: రిక్రూట్‌మెంట్‌ టెస్ట్‌, ఇంటర్వ్యూ ఆధారంగా.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

దరఖాస్తులకు చివరి తేది: 2021, నవంబరు 11.

వెబ్‌సైట్‌: www.upsc.gov.in/


ఏపీలో 3393 మిడ్‌లెవల్‌ హెల్త్‌ ప్రొవైడర్లు

భారత ప్రభుత్వ ఆధ్వర్యంలోని నేషనల్‌ హెల్త్‌ మిషన్‌, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతున్నారు.

మొత్తం ఖాళీలు: 3393 శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం-633 తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా-1003 గుంటూరు, ప్రకాశం, నెల్లూరు-786 చిత్తూరు, కడప, అనంతపురం, కర్నూలు-971

అర్హత: బీఎస్సీ నర్సింగ్‌ ఉత్తీర్ణత. సంబంధిత సర్టిఫికెట్‌ ప్రోగ్రాములు చేసి ఉండాలి.

వయసు: 35 ఏళ్లు మించకూడదు.

ఎంపిక విధానం: అకడమిక్‌ మెరిట్‌ మార్కుల ఆధారంగా.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

దరఖాస్తులకు చివరి తేది: 2021, నవంబరు 06.

వెబ్‌సైట్‌: https://cfw.ap.nic.in/MLHP2021.html


ప్రవేశాలు


ఎంఎస్‌ఎంఈ టూల్‌ రూం, హైదరాబాద్‌లో...

భారత ప్రభుత్వ ఎంఎస్‌ఎంఈ మంత్రిత్వశాఖకు చెందిన సెంట్రల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ డిజైన్‌ (సీఐటీడీ)-హైదరాబాద్‌లోని ఎంఎస్‌ఎంఈ టూల్‌ రూం 2021 విద్యాసంవత్సరానికి కింది పీజీ డిప్లొమా ప్రోగ్రాముల్లో ప్రవేశాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

* పోస్టు గ్రాడ్యుయేట్‌ డిప్లొమా కోర్సులు

* పీజీ డిప్లొమా ఇన్‌ టూల్‌ డిజైన్‌ అండ్‌ సీఏడీ/ సీఏఎం - 60 సీట్లు ●* పీజీ డిప్లొమా ఇన్‌ వీఎల్‌ఎస్‌ఐ, ఎంబడెడ్‌ సిస్టమ్స్‌ (పీజీడీవీఈఎస్‌)- 40 సీట్లు * పీజీ డిప్లొమా ఇన్‌ మెకట్రానిక్స్‌ (పీజీడీఎం)- 40 సీట్లు కోర్సు వ్యవధి: 18 నెలలు (3 సెమిస్టర్లు).

అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/ బీటెక్‌ ఉత్తీర్ణత.

వయసు: 45 ఏళ్లు మించకుండా ఉండాలి.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా.

దరఖాస్తులకు చివరి తేది: 2021, నవంబరు 19.

చిరునామా: ది డైరెక్టర్‌ (ట్రెయినింగ్‌), సీఐటీడీ, బాలానగర్‌, హైదరాబాద్‌ - 500037.

వెబ్‌సైట్‌: www.citdindia.org/


స్కాలర్‌షిప్స్‌


ఎంజేపీ విదేశీ విద్యా నిధి స్కాలర్‌షిప్‌

తెలంగాణ ప్రభుత్వం మహాత్మా జ్యోతిబాపూలే విదేశీ విద్యా నిధి ప్రోగ్రాం ద్వారా విదేశాల్లో ఉన్నత విద్య అభ్యసించాలనుకునే బీసీ, ఈబీసీ విద్యార్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.

* మహాత్మా జ్యోతిబాపూలే విదేశీ విద్యా నిధి ఉపకారవేతన పథకం

స్కాలర్‌షిప్‌ మొత్తం: రూ.20 లక్షల వరకు/ అడ్మిషన్‌ లెటర్‌ ప్రకారం చెల్లిస్తారు. అలాగే వన్‌వే ఎకనమిక్‌ టికెట్‌, వీసా చార్జీలు కూడా చెల్లిస్తారు.

అర్హత: 60 శాతం మార్కులతో ఇంజినీరింగ్‌, మేనేజ్‌మెంట్‌, సైన్స్‌, అగ్రికల్చర్‌, వైద్య, నర్సింగ్‌, సోషల్‌ సైన్సెస్‌, హ్యూమానిటీస్‌ విభాగాల్లో డిగ్రీ ఉత్తీర్ణత. జీఆర్‌ఈ/ జీమ్యాట్‌ స్కోర్‌, ఇంగ్లిష్‌ ప్రొఫిషియన్సీ టెస్ట్‌తో పాటు కుటుంబ వార్షికాదాయం రూ.5లక్షలు మించకుండా ఉండాలి. సీఓఈ, ఐ 20 వీసా ఉన్న వారు దరఖాస్తు చేసుకోవచ్చు.

వయసు: 35 ఏళ్ల లోపు ఉండాలి.

దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 2021, నవంబరు 01.

దరఖాస్తులకు చివరి తేది: 2021, నవంబరు 30.

వెబ్‌సైట్‌: https://telanganaepass.cgg.gov.in/


 


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని