నోటీస్‌బోర్డు

భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన ఇండియన్‌ ఏర్‌ఫోర్స్‌ 2023 సంవత్సరానికి గాను కింది ఖాళీల భర్తీకి అర్హులైన అవివాహిత పురుషులు, మహిళల నుంచి దరఖాస్తులు కోరుతోంది.

Updated : 29 Nov 2021 06:40 IST

ప్రభుత్వ ఉద్యోగాలు

ఏఎఫ్‌క్యాట్‌-ఎన్‌సీసీ స్పెషల్‌ ఎంట్రీ

భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన ఇండియన్‌ ఏర్‌ఫోర్స్‌ 2023 సంవత్సరానికి గాను కింది ఖాళీల భర్తీకి అర్హులైన అవివాహిత పురుషులు, మహిళల నుంచి దరఖాస్తులు కోరుతోంది.

* ఏర్‌ఫోర్స్‌ కామన్‌ అడ్మిషన్‌ టెస్ట్‌(ఏఎఫ్‌క్యాట్‌)-ఎన్‌సీసీ స్పెషల్‌ ఎంట్రీ-జనవరి 2023

మొత్తం ఖాళీలు: 317, బ్రాంచిల వారీగా ఖాళీలు: ఫ్లయింగ్‌-77, గ్రౌండ్‌ డ్యూటీ(టెక్నికల్‌)-129, గ్రౌండ్‌ డ్యూటీ(నాన్‌ టెక్నికల్‌)-111,

అర్హత: సంబంధిత సబ్జెక్టులతో ఇంటర్మీడియట్‌తో పాటు ఏదైనా డిగ్రీ/ బీఈ/ బీటెక్‌ ఉత్తీర్ణత. డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్న అభ్యర్థులూ దరఖాస్తు చేసుకోవచ్చు.

ఎంపిక విధానం: ఆన్‌లైన్‌ పరీక్ష ఆధారంగా.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 2021, డిసెంబరు 01.

దరఖాస్తు చివరి తేది: 2021, డిసెంబరు 30.

వెబ్‌సైట్‌: https://afcat.cdac.in/AFCAT/


50 అసిస్టెంట్‌ కమాండెంట్లు

భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన ఇండియన్‌ కోస్ట్‌ గార్డ్‌ 02/ 2022 బ్యాచ్‌ కోసం వివిధ విభాగాల్లో కింది పోస్టుల భర్తీకి అర్హులైన స్త్రీ/ పురుష అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.

* అసిస్టెంట్‌ కమాండెంట్లు

మొత్తం ఖాళీలు: 50, విభాగాల వారీగా ఖాళీలు: జనరల్‌ డ్యూటీ (మేల్‌)-30, కమర్షియల్‌ పైలట్‌ ఎంట్రీ (సీపీఎల్‌ - ఎస్‌ఎస్‌ఏ) (మేల్‌/ ఫిమేల్‌)-10, టెక్నికల్‌ (ఇంజినీరింగ్‌ అండ్‌ ఎలక్ట్రికల్‌) (మేల్‌)-10.

అర్హత: సంబంధిత సబ్జెక్టులతో ఇంటర్మీడియట్‌తో పాటు బ్యాచిలర్స్‌ డిగ్రీ, ఇంజినీరింగ్‌ డిగ్రీ ఉత్తీర్ణత. .

ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్‌, ప్రిలిమినరీ పరీక్ష (మెంటల్‌ ఎబిలిటీ టెస్ట్‌/ కాగ్నిటివ్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌, పిక్చర్‌ పర్‌సెప్షన్‌ అండ్‌ డిస్కషన్‌ టెస్ట్‌. ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌), ఫైనల్‌ టెస్ట్‌ (సైకలాజికల్‌ టెస్ట్‌, గ్రూప్‌ టాస్క్‌, ఇంటర్వ్యూ (పర్సనాలిటీ టెస్ట్‌) ఆధారంగా.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 2021, డిసెంబరు 06.

దరఖాస్తులకు చివరి తేది: 2021, డిసెంబరు 17.

వెబ్‌సైట్‌: https://www.joinindiancoastguard.gov.in/


యూపీఎస్సీ-21 పోస్టులు

యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (యూపీఎస్సీ) వివిధ కేంద్ర మంత్రిత్వశాఖల్లో కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీలు: 21,

పోస్టులు: ప్రొఫెసర్‌, అసోసియేట్‌ ప్రొఫెసర్‌, ట్యూటర్‌.

విభాగాలు: కంట్రోల్‌ సిస్టమ్‌, కంప్యూటర్‌ సైన్స్‌, ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్‌, మెకానికల్‌ ఇంజినీరింగ్‌ తదితరాలు.

అర్హత: పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో మాస్టర్స్‌ డిగ్రీ, పీహెచ్‌డీ ఉత్తీర్ణత, అనుభవం.

ఎంపిక విధానం: రిక్రూట్‌మెంట్‌ టెస్ట్‌, ఇంటర్వ్యూ ఆధారంగా.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

దరఖాస్తులకు చివరి తేది: 2021, డిసెంబరు 16.

వెబ్‌సైట్‌: https://www.upsc.gov.in/


ఎన్‌టీఆర్‌ హెల్త్‌ యూనివర్సిటీలో...

విజయవాడలోని డాక్టర్‌ ఎన్‌టీఆర్‌ యూనివర్సిటీ ఆఫ్‌ హెల్త్‌ సైన్సెస్‌ (ఎన్‌టీఆర్‌యూహెచ్‌ఎస్‌) ఔట్‌సోర్సింగ్‌ ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీలు: 15,

పోస్టులు-ఖాళీలు: సిస్టమ్‌ అడ్మినిస్ట్రేటర్‌-03, కంప్యూటర్‌ ఆపరేటర్‌-10, డేటా ఎంట్రీ ఆపరేటర్‌-02.

అర్హత: పోస్టుల్ని అనుసరించి ఏదైనా డిగ్రీతో పాటు పీజీడీసీఏ, బీటెక్‌ ఉత్తీర్ణత, అనుభవం.

వయసు: 01.07.2021 నాటికి 18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక విధానం: మెరిట్‌ మార్కులు, రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ ఆధారంగా.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా.

దరఖాస్తులకు చివరి తేది: డిసెంబరు 08.

వెబ్‌సైట్‌: http://ntruhs.ap.nic.in/


మరిన్ని నోటిఫికేషన్ల కోసం... క్యూఆర్‌ కోడ్‌ స్కాన్‌ చేయండి


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని