నోటీస్‌బోర్డు

భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన బెంగళూరులోని భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌ (బెల్‌) కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

Updated : 24 Jan 2022 06:04 IST

ప్రభుత్వ ఉద్యోగాలు

బెల్‌-బెంగళూరులో 247 పోస్టులు

భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన బెంగళూరులోని భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌ (బెల్‌) కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీలు: 247

పోస్టుల వారీగా ఖాళీలు: ప్రాజెక్ట్‌ ఇంజినీర్లు-67, ట్రెయినీ ఇంజినీర్లు-169, ట్రెయినీ ఆఫీసర్లు (ఫైనాన్స్‌)-11.

విభాగాలు: ఎలక్ట్రానిక్స్‌, మెకానికల్‌, కంప్యూటర్‌ సైన్స్‌, ఎల‌్రక్టికల్‌, సివిల్‌ తదితరాలు. అర్హత: పోస్టును అనుసరించి స్పెషలైజేషన్‌లో కనీసం 55 శాతం మార్కులతో సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/ బీటెక్‌/ బీఎస్సీ/ బీఆర్క్‌/ ఎంబీఏ ఉత్తీర్ణత. 

 వయసు: జనవరి 01, 2022 నాటికి 28-32 ఏళ్లు మించకుండా ఉండాలి.

పోస్టును అనుసరించి నెలకు రూ.30,000-రూ.55,000.

పని అనుభవం: కనీసం 6 నెలల అనుభవం ఉండాలి.

ఎంపిక విధానం: అకడమిక్‌ మెరిట్‌ మార్కులు, పని అనుభవం, ఇంటర్వ్యూ ఆధారంగా.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: ఫిబ్రవరి 04, 2022.

వెబ్‌సైట్‌: https://www.bel-india.in/


కోస్ట్‌ గార్డ్‌ రీజియన్‌లో...

భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన చెన్నైలోని కోస్ట్‌ గార్డ్‌ రీజియన్‌ (ఈస్ట్‌) కింది సివిలియన్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

* సివిలియన్‌ పోస్టులు

మొత్తం ఖాళీలు: 80

పోస్టులు: ఇంజిన్‌ డ్రైవర్‌, సారంగ్‌ లస్కర్‌, స్టోర్‌ కీపర్‌, సివిలియన్‌ మోటార్‌ ట్రాన్స్‌పోర్ట్‌ డ్రైవర్‌, ఫైర్‌మెన్‌, ఐస్‌ ఫిట్టర్‌, స్ప్రే పెయింటర్‌, మల్టీ టాస్కింగ్‌ స్టాఫ్‌, షీట్‌ మెటల్‌ వర్కర్‌ తదితరాలు.

అర్హత: పదో తరగతి, సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

వయసు: పోస్టుల్ని అనుసరించి 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక విధానం: రాత పరీక్ష, ట్రేడ్‌/ స్కిల్‌ టెస్ట్‌ ఆధారంగా.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా.

చిరునామా: కమాండర్‌, కోస్ట్‌ గార్డ్‌ రీజియన్‌ (ఈస్ట్‌), నాపైర్‌ బ్రిడ్జి దగ్గర, సెయింట్‌ జార్జ్‌ పోర్ట్‌, చెన్నై-600009.

దరఖాస్తులకు చివరి తేది: ఎంప్లాయిమెంట్‌ న్యూస్‌ (2022 జనవరి 22-28)లో ఈ ప్రకటన వెలువడిన తేదీ నుంచి 30 రోజుల్లోపు.

వెబ్‌సైట్‌: https://indiancoastguard.gov.in/


కేంద్ర మంత్రిత్వశాఖల్లో...

యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (యూపీఎస్సీ) వివిధ కేంద్ర మంత్రిత్వశాఖల్లో కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీలు: 14

పోస్టులు: సీనియర్‌ అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీసర్లు, అసిస్టెంట్‌ ఎంప్లాయిమెంట్‌ ఆఫీసర్‌, సబ్‌ రీజియనల్‌ ఎంప్లాయిమెంట్‌ ఆఫీసర్‌ తదితరాలు.

అర్హత: పోస్టుల్ని అనుసరించి డిగ్రీ, సంబంధిత సబ్జెక్టుల్లో మాస్టర్స్‌ డిగ్రీ, పీజీ డిగ్రీ ఉత్తీర్ణత, పని అనుభవం ఉండాలి.

వయసు: పోస్టుల్ని అనుసరించి 30 నుంచి 50 ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక విధానం: రిక్రూట్‌మెంట్‌ టెస్ట్‌/ ఇంటర్వ్యూ ఆధారంగా.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

దరఖాస్తు ఫీజు: ఇతరులు రూ.25 చెల్లించాలి. ఎస్సీ/ ఎస్టీ/ పీడబ్ల్యూడీ అభ్యర్థులకు ఫీజు లేదు.

దరఖాస్తులకు చివరి తేది: ఫిబ్రవరి 10, 2022.

వెబ్‌సైట్‌: https://www.upsc.gov.in/


కేబినెట్‌ సెక్రటేరియట్‌లో...

భారత ప్రభుత్వానికి చెందిన న్యూదిల్లీలోని కేబినెట్‌ సెక్రటేరియట్‌ దేశవ్యాప్తంగా కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

* డిప్యూటీ ఫీల్డ్‌ ఆఫీసర్లు (జీడీ)

మొత్తం ఖాళీలు: 38

భాషలు: బాలోచి, భాస, బర్మీసీ, డారి, జోన్‌ఖా, దివేహి, కచిన్‌, రష్యన్‌, సిన్‌హళ.

అర్హత: సంబంధిత లాంగ్వేజ్‌ ఒక సబ్జెక్టుగా బ్యాచిలర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణత.

వయసు: 21 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి.

నెలకి రూ.44,900.

ఎంపిక విధానం: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా.

పరీక్షా విధానం: మొత్తం 240 మార్కులకు పరీక్ష ఉంటుంది. ఇందులో 200 మార్కులకి రాత పరీక్ష, మిగిలిన 40 మార్కులకి ఇంటర్వ్యూ నిర్వహిస్తారు.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా.

చిరునామా: పోస్ట్‌ బ్యాగ్‌ నెం.001, లోదీ రోడ్‌ హెడ్‌ పోస్టాఫీస్‌, న్యూదిల్లీ -110003.

దరఖాస్తులకు చివరి తేది: మార్చి 04, 2022.

వెబ్‌సైట్‌: https://cabsec.gov.in/


అప్రెంటిస్‌షిప్‌

ఆర్‌సీఐ-హైదరాబాద్‌లో 150 అప్రెంటిస్‌లు

భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన హైదరాబాద్‌లోని డీఆర్‌డీఓ-రిసెర్చ్‌ సెంటర్‌ ఇమారత్‌ (ఆర్‌సీఐ) వివిధ విభాగాల్లో అప్రెంటిస్‌ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీలు: 150

అప్రెంటిస్‌ ఖాళీలు: గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌లు 40, టెక్నీషియన్‌ (డిప్లొమా) అప్రెంటిస్‌లు 60, ట్రేడ్‌ అప్రెంటిస్‌లు 50.

విభాగాలు: ఫిట్టర్‌, టర్నర్‌, ఎలక్ట్రీషియన్‌, ఎలక్ట్రానిక్స్‌ మెకానిక్‌, వెల్డర్‌, ఈసీఈ, ఈఈఈ, సీఎస్‌ఈ, మెకానికల్‌, కెమికల్‌.

అర్హత: సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ, బీకాం, బీఎస్సీ, బీఈ/ బీటెక్‌ ఉత్తీర్ణత.

స్టైపెండ్‌: నెలకు రూ.8000-రూ.9000.

వయసు: జనవరి 01, 2022 నాటికి 18 ఏళ్లు ఉండాలి.

ఎంపిక విధానం: అకడమిక్‌ మెరిట్‌/ రాత పరీక్ష/ ఇంటర్వ్యూ ఆధారంగా.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

దరఖాస్తులకు చివరి తేది: ఫిబ్రవరి 07, 2022

వెబ్‌సైట్‌: https://www.drdo.gov.in/


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని